మోదీప్ర‌భుత్వంపై మ‌రోసారి నిప్పుల చెరిగిన్నా కేటీఆర్..

హైద‌రాబాద్‌: మోదీప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు మ‌రోసారి ఐటీ మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. అసెంబ్లీ ప్ర‌శ్నోత్త‌రాల నేప‌థ్యంలో టీఎస్ ఐపాస్ కింద ప‌రిశ్ర‌మ‌ల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి కేటీఆర్ స‌మాధానం ఇస్తూ… ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంతో తెలంగాణ ,ఏపీ రాష్ట్రాల్లో పారిశ్రామీకీక‌ర‌ణ‌కు స‌హాయం చేయాల‌ని, రాయితీలు ఇస్తామ‌ని పేర్కొన్న‌ప్ప‌టికి ఎలాంటి సాయం అంద‌లేద‌న్నారు. ఇప్ప‌టికైనా కేంద్రప్ర‌భుత్వం ప్ర‌త్యేక రాయితీల‌ను ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం కోరుతుంద‌న్నారు. ఆరున్న‌సంవ‌త్స‌రంలో తెలంగాణ‌కు కేంద్రం అణాపైసా కూడా సహాయం చేయ‌లేదు. కేంద్రం తెలంగాణ‌కు చేసింది గుండుసున్నా అని ధ్వ‌జ‌మెత్తారు. వారు పార్ల‌మెంట్‌లో చేసిన చ‌ట్టాన్నే తుంగ‌లో తొక్కుతున్నార‌ని నిప్పుల చెరిగారు. కేంద్రం తెచ్చిన రూ.20 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజీ ఏమైందో ఎవ‌రికి తెలియ‌ద‌న్నారు. ఈ ఆత్మ‌నిర్మ‌ల్ ప్యాకేజీ వ‌ల్ల తెలంగాణ‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌లేద‌న్నారు. కేవ‌లం వీధి వ్యాపారుల‌కు మాత్ర‌మే రూ.10లోన్లు ఇచ్చార‌ని కేటీఆర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *