న‌గ‌ర‌మంతా ట్రాఫిక్ వ‌ల‌యంలో…

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ మిన‌హాయింపు గ‌డుపు ముగుస్తున్న త‌రుణంలో హైద‌రాబాద్ న‌గ‌రంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. అంద‌రూ ఇళ్ల‌కు చేరాల‌న్నా ఆత్రుత‌తో 12 నుండి ఒంటి గంట మ‌ధ్య‌లో జ‌నం ప‌నులు ముగించుకుని భారీగా రోడ్ల‌మీద‌కు వ‌స్తున్నారు. దీంతోప‌లు ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో న‌గ‌ర‌మంతా ట్రాఫిక్ వ‌ల‌యంలో చిక్కుకుంటుంది. రెండు గంట‌ల పాటు న‌గ‌రంలో ఎక్క‌డ చూసినా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దిల్ సుక్‌న‌గ‌ర్ నుండి కోటీ, పంజాగుట్ట‌, నుండి కూక‌ట్‌ప‌ల్లి, సికింద్రాబాద్‌, బేగంపేట‌, రాణిగంజ్‌, అఫ్జ‌ల్ గంజ్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. 2గంట‌ల నుండిలాక్‌డౌన్ అమ‌లు కానున్న సంద‌ర్భంలో చెక్ పోస్టుల వ‌ద్ద పోలీసుల‌కు చిక్క‌కూడ‌ద‌నే ఆలోచ‌న‌తో వాహ‌నదారులు వెళుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *