సోమ‌వారం నుండి మెట్రో స‌ర్వీసుల స‌మ‌యం పెంచారు….

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్రంలో మే 12 నుండి లాక్‌డౌన్ వేసిన సంగ‌తి తెలిసిందే. కానీ తెలంగాణ స‌ర్కారు ఈ నెల 31 నుండి లాక్ డౌన్ స‌మ‌యం కొంత కుదిచివేసింది. మే 12 నుండి జూన్ 30వ‌ర‌కు ఉద‌యం 6 నుండి 10:00 వ‌ర‌కు ప్ర‌జ‌ల అవ‌స‌రాల రీత్య స‌డ‌లింపు చేసింది. 10:00 నుండి మ‌రస‌టి రోజు ఉద‌యం 6:00గంట‌ల వ‌ర‌కు లాక్‌డౌన్ విధించారు. మే 31 నుండి జూన్ 9 వ‌ర‌కు లాక్‌డౌన్ లోని స‌డ‌లింపు స‌మ‌యాన్ని పెంచారు. ఉద‌యం 6నుండి మ‌ధ్యాహ్నం 1:00 వ‌ర‌కు పొడించారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల దృష్ట కొంత స‌మ‌యాన్ని పొడిగించారు. ఇక ఇదిలా ఉంటే హైద‌రాబాద్ మెట్రో టైమింగ్స్‌లో మ‌రోసారి మార్చారు. సోమ‌వారం నుండి మెట్రో స‌ర్వీసుల స‌మ‌యం పెంచారు. లాక్‌డౌన్ స‌డ‌లింపుల‌తో టైమింగ్స్ మార్చుతున్న‌ట్లు మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి ప్ర‌ట‌క‌న చేశారు. ఉద‌యం 7గంట‌ల‌నుండి మెట్రో రైళ్లు తిరుగుతున్నాయి. మూడు క్యారిడారల్లోని స్టేష‌న్ల‌లో 11:45 గంట‌ల‌కు చివ‌రి ట్రైన్ ఉంటుంది. మ‌ధ్యాహ్నం 12:45 గంట‌ల‌కు చివ‌రి గ‌మ్య‌స్థానం చేరుకుంటుంది. అని అధికారులు పేర్కొన్నారు. ఆదివారం వ‌ర‌కూ రోజుకు 3 వేల లోపే హైద‌రాబాద్ మెట్రోలో ప్ర‌యాణం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *