మ‌ద్యం దుకాణాలు కొవిడ్ వ‌న‌రులుగా మారాయి- హైకోర్టు

హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మ‌ద్యం దుకాణాలు కొవిడ్ వ‌న‌రులుగా మారాయ‌ని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో కొవిడ్ ప‌రిస్థితుల‌పై నేడు హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ నేప‌థ్యంగా క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాలు అమ‌లుపై హైకోర్టుకు డీజీపీ నివేదిక స‌మ‌ర్పించారు.ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌లు చాలా త‌క్కువ‌గా చేస్తున్నార‌ని హైకోర్టు మ‌రోసారి అసంతృప్తి వ్య‌క్తం చేసింది. కేంద్ర ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌లు 70శాతం పెంచాల‌ని సూచించింది. మ‌ద్యం దుకాణాలు ,ప‌బ్‌లు, థియేట‌ర్ల‌లోర‌ద్దీపై హైకోర్టు ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. మ‌ద్యం దుకాణాలు క‌రోనా వ‌న‌రుల‌గా మారాయ‌ని ఈ నేప‌థ్యంగా హైకోర్టు వ్య‌క్తం చేసింది. ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చే వారికి కొవిడ్ ప‌రీక్ష‌లు చేయాల‌ని సూచించింది. నిపుణుల‌తో స‌ల‌హా క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని ఆదేశించింది. క‌రోనా నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల‌పై సుమారు 22వేల కేసులు న‌మోదు చేసిన‌ట్టు డీజీపీ నివేదిక‌లో వెల్ల‌డించారు.సామాజిక దూరం పాటించ‌ని వారిపై 2,416 న‌మోదు చేశామ‌ని పేర్కొన్కన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *