తెలంగాణ జిల్లాల్లో ఒక‌టి, రెండు చోట్ల భారీ వ‌ర్షాలు …

హైదరాబాద్‌: హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు పేర్కొంది. ప‌లు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపుల‌తో కూడిన తేలిక‌పాటి నుండి ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. నైరుతి, మ‌ధ్య తెలంగాణ జిల్లాల్లో ఒక‌టి, రెండు చోట్ల భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు చెప్పింది. ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం ద‌క్షిన ఛ‌త్తీస్‌గ‌ఢ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో స‌ముద్ర‌మ‌ట్టానికి 0.9 కిలోమీట‌ర్ల వ‌ద్ద ఏర్ప‌డింది. గాలి విచ్చిన విచ్చిన్న‌తి తెలంగాణ రాష్ట్రంపై స‌ముద్ర మ‌ట్టానికి 1.5 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ‌శాఖ అధికారులు చెప్పారు.తెలంగాణ‌పై 1500 మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కూ గాలుల విచ్చిన్న‌త ఏర్ప‌డింది. మ‌రోవైపు నైరుతి రుతుప‌వ‌నాలు బ‌ల‌ప‌డ్డాయ‌ని, రానున్న 24 గంట‌ల్లో కేర‌ళ‌లోకి ప్ర‌వేశించే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. నైరుతి రుతుప‌వనాలు గురువారం కేర‌ళ‌లోకి ప్ర‌వేశించే అవ‌కాశాలు ఉన్నాయ‌న్నారు. వీటి ప్ర‌భావంతో గురు, శుక్ర‌వారాల్లో కొన్ని చోట్ల భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌న్నారు. మ‌రోవైపు గురువారం ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కార‌ణంగా ప‌లు జిల్లాల్లో తేలిక పాటి నుండి మోస్తారు కురిశాయి. అత్య‌ధికంగా మ‌హ‌బూబాబాద్ జిల్లా కుర‌విలోఏడు సెంటీమీట‌ర్ల వ‌ర్షం కురిసింది. ప‌లు ప్రాంతాల్లోమోస్తారు వాన కురిసింది. యాద్రాది భువ‌న‌గిరి,న‌ల్లొండ‌,రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ,మెద‌క్ ,వ‌రంగ‌ల్ అర్భ‌న్‌,రూర‌ల్ , ములుగు, ఖ‌మ్మం, సూర్యాపేట‌, నాగ‌ర్ క‌ర్నూల్‌తో పాటు ప‌లు జిల్లాలో అక్క‌డ‌క్క‌డ తేలిక‌పాటి జ‌ల్లులు కురిశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *