శుక్ర‌వారం నుంచి కరోనా బులెటిన్ రోజూ విడుద‌ల చేయాలి-హైకోర్టు

హైద‌రాబాద్‌: గ‌త ఏడాది నుంచి ప్ర‌జ‌ల‌ను ప‌ట్టిపీడిస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారి విష‌యం తెలిసిందే. కరోనా ప‌రీక్ష‌ల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం నివేదిక స‌మ‌ర్పించింది. జ‌న‌వ‌రి25నుంచి ఈనెల 12 వ‌ర‌కు టెస్టుల వివ‌రాల‌ను నివేదిక‌లో తెలిసింది. జూన్‌3నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు3 సీరం సర్వేలు జ‌రిగాయ‌ని పేర్కొంది. వీలైనంత త్వ‌ర‌లో సీరం సర్వే చేయాల‌ని హైకోర్టు ఆదేశించింది. స‌ర్వే నివేదిక సిఫార్సులు అమ‌లుయ్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశాల్లో తెలిపింది. క‌రోనా ప‌రిస్థితుల‌పై హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది.శుక్ర‌వారం నుంచి క‌రోనా బులెటిన్ రోజూ విడుద‌ల చేయాల‌ని ఆదేశించింది. వ్యాక్సిన్ రిజిస్ట్రేష‌న్ విధానంపై విస్తృత ప్ర‌చారం చేయాంటూ .. త‌దుప‌రి విచార‌ణ మార్చి 18కి హైకోర్టు వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *