తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల బాగోగులే నాకు అత్యంత ముఖ్యం…

హైద‌రాబాద్‌: తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ అంద‌రికి తెలిసిన విష‌యమే.కానీ, ఆమె పుదుచ్చేరీ లెప్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ గా అద‌న‌పు బాధ్య‌త‌లు స్వీక‌రించింది.శుక్ర‌వారం పుదుచ్చేరి నుండి తెలంగాణ రాష్ట్ర అంశాల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. పుదుచ్చేరి రాజ్ నివాస్ నుండి గ‌వ‌ర్న‌ర్ వీడియో కాన్ప‌రెన్స్ ద్వారా హైద‌రాబాద్ రాజ్ భ‌వ‌న్ అధికారుల‌తో తెలంగాణ రాష్ట్ర అంశాల‌కు సంబంధించిన వివిధ విషయాల‌పై స‌మ‌గ్రంగా స‌మీక్ష చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాటాడుతూ.. నేను పుదుచ్చేరి లెప్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా అద‌న‌పు బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టీకి, తెలంగాణ‌కు సంబంధించిన విష‌యాల‌పై ఇత‌ర సంక్షేమం బాగోగులు నాకు అత్యంత ప్రాధాన్య‌త‌. నేను పుదుచ్చేరిలో ఉన్న‌ప్ప‌టికీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్ర‌జ‌ల సంక్షేమం ప‌ట్ల అణుక్ష‌ణం నా త‌ప‌న అలానే ఉంది. నేను మీకు (రాజ్‌భ‌వ‌న్‌,హైద‌రాబాద్ అధికారుల‌కు) ఎల్ల‌ప్పుడూ అందుబాటులోనే ఉంటాను. అవ‌స‌ర‌మైన విష‌యాలు నాదృష్టికి తీసుకురండి అని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ,ప్ర‌జ‌ల‌కు సంబంధించిన విష‌యాలు నాకు అత్యంత ప్రాధాన్యం అని డా. త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ వివ‌రించారు. సెక్ర‌ట‌రి టు గ‌వ‌ర్న‌ర్ కె.సురేంద్ర మోహ‌న్ పుదుచ్చేరి నుండి గ‌వ‌ర్న‌ర్ తో వీడియో కాన్ప‌రెన్స్‌లో పాల్గొన్నారు. హైద‌రాబాద్ రాజ్ భ‌వ‌న్ నుండి గ‌వ‌ర్న‌ర్ స‌ల‌హాదారులు, జాయింట్ సెక్ర‌ట‌రీలు, ఇత‌ర అధికారులు ఈ వీడియో కాన్ప‌రెన్స్‌లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *