డ్రోన్ల ద్వారా అత్య‌వ‌స‌ర కొవిడ్ మందులు- కేంద్రం గ్రిన్ సిగ్న‌ల్

హైద‌రాబాద్‌:తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ ర‌క్క‌సి విరుచుక‌ప‌డుతుంది,ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న రోజుకు 4 నుండి 5వేల‌పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. మ‌ర‌ణాల సంఖ్య కూడా క‌ల‌వ‌ర పెడుతోంది. ఈక్ర‌మంలో వ్యాక్సినేష‌న్‌, టీకాల పంపిణీ ప్ర‌క్రియ మ‌రింత వేగ‌వంతం చేసేలా కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంది తెలంగాణ‌స‌ర్కారు. అయితే… దూర‌ప్రాంతాలకు వ్యాక్సిన్ పంపిణీ చాలా ఆల‌స్య‌మౌతోంది. దీంతో డ్రోన్ల స‌హాయం తీసుకోవాల‌ని భావించింది. దూర ప్ర‌యాణ సామ‌ర్థ్యం గ‌ల డ్రోన్ల‌ను అద్దెకు తీసుకుని… వినియోగించుకొనేందుకు స‌న్నాహాలు చేప‌ట్టింది. ఈ నెల మూడు వారం లేదా ..జూన్ మొద‌టి వారంలో డ్రోన్ల ద్వారా కొవిడ్ మందుల‌ను పంపిణీ చేయాల‌ని నిర్ణయం తీసుకుంది. ముందుగా వికారాబాద్ ప్రాంతంలో ప్రారంభించి…ఆ త‌రువాత ఇత‌ర జిల్లాల‌కు విస్త‌రించ‌నుంది. గ‌రిష్టంగా 30 కిలోమాట‌ర్ల దూరంలోని గ్రామాల‌కు టీకాలు ,మందుల‌ను పంపిణీ చేయ‌నుంది. మొద‌టి ద‌శ‌లో 7 డ్రోన్ల‌తో 24 రోజుల పాటు ప్ర‌యోగాత్మ‌కంగా ర‌వాణా చేప‌డుతారు. సాంకేతిక స‌మ‌స్య‌లుంటే ప‌రిష్కరిస్తారు. తెలంగాణ లో డ్రోన్ల ద్వారా అత్య‌వ‌స‌ర కొవిడ్ మందుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌యాణ ద్వారా ప‌రిమితిని తొల‌గిస్తూ.. మ‌రో నిబంధ‌న‌ను స‌డ‌లించింది. మంత్రి కేటీఆర్ సూచ‌న‌ల మేర‌కు క‌రోనా టీకాలు, మందుల పంపిణీ కోసం డ్రోన్ల‌ను వినియోగించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి కోరగా… మాన‌వ ర‌హిత విమాన వ్య‌వ‌స్థ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా కేంద్రం గ‌త వారం ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *