మ‌రో వారం పాటు క‌ర్ప్యూని పొడ‌గిస్తూ నిర్ణ‌యం- సోమేష్‌కుమార్

హైద‌రాబాద్‌: ఇప్పుడు క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజు విజృభిస్తోన్న త‌రుణంలో తెలంగాణ‌లో క‌ర్ప్యూని పొడిగిస్తున్న‌ట్లు టీఎస్ స‌ర్కార్ నిర్ణ‌యించింది. కొవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా రాష్ట్రంలో మొద‌టి ఏప్రిల్ 30 వ‌ర‌కు క‌ర్వ్యూవిధించారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌క‌పోవ‌డం, భార‌త‌దేశవ్యాప్తంగా ప‌రిస్థితులు తీవ్రంగా ఉండ‌డంతో క‌ర్ప్యూని పొడిగించాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల నుండి స‌మాచారం. నేడు ఈ విష‌య‌మై రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్‌కుమార్ ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించారు. అనంత‌రం మ‌రో వారం పాటు క‌ర్ప్యూని పొడ‌గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. మే1 నుండి మే8 వ‌తేదీ వ‌ర‌కు క‌ర్ప్యూని పొడిగిస్తూ జీవో జారీ చేశారు. ఈ క‌ర్ప్యూ అమ‌లు కోసం జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు పూర్తి అధికారాల‌ను క‌ట్ట‌బెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *