తెలంగాణ లో తాజాగా 1,321 మంది క‌రోనా కేసులు న‌మోదు…..

హైద‌రాబాద్‌: గత సంవ‌త్స‌రం నుంచి క‌రోనా ప్ర‌జ‌ల‌ను పీడిస్తోంది. క‌రోనా రెండో ద‌శ వ్యాప్తి మ‌రింత‌గా పెరుగుతోంది. రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 8000 కు చేరువైంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 62,973 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా…1,321 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్ప‌టి క‌రోనా సోకిన వారి సంఖ్య 3,12,140 కి చేరింది. రాష్ట్రంలోఇప్పుడు 7,923 యాక్టివ్ కేసులుఉన్న‌ట్లు వైద్యారోగ్య‌శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. కొత్త‌గా క‌రోనాతో ఐదుగురుమృతి చెంద‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య‌1,7,17 కి చేరింది. నిన్న 293 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,886 మంది బాధితులు హోం ఐసోలేష‌న్ లో ఉన్నారు. మ‌రోవైపు జీహెచ్ఎంసీ ప‌రిధిలోనూ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. కొత్త‌గా 320క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *