న‌గ‌రంలోని పెరుగుతున్న కొవిడ్ కేసులు.-ప‌ట్టించుకొని జీహెచ్‌ఎంసీ

హైద‌రాబాద్: అంద‌మైన హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌రిధిలోని కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గ్రేట‌ర్ ప‌రిధిలో నాలుగు వంద‌ల‌కుపైగా కేసులు న‌మోద‌వుతున్నాయి. గ్రేట‌ర్ ప‌రిధిలో కొవిడ్ బాధితులు కిట్స్ అంద‌క ఇబ్బందులు ప‌డుతున్నారు. మైక్రో కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు ఇప్ప‌టివ‌ర‌కు స్ప‌ష్ట‌త లేదు. జీహెచ్ఎంసీ, వైద్య శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేక‌పోవ‌డంతో ఇబ్బందులు ప‌డుతున్నారు. చెబుతున్నారు.గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో కొవిడ్ విప‌రీత‌మైన స్పీడ్‌తో విస్త‌రిస్తోంది. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో ఇన్‌పేషెంట్లుగా సుమారు 2500 మందివ‌ర‌కు చికిత్స పొందుతున్నారు. పాజిటివ్ బారిన ప‌డుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. ఓ ప‌క్క కొవిడ్ ప‌రీక్ష‌ల కోసం త‌ర‌లివ‌స్తున్న ప్ర‌జ‌లు.. మ‌రో ప‌క్క వ్యాక్సిన్ కోసం వెళ్తున్న‌వారు.. ఆస్ప‌త్రుల‌కు ఒక్కసారిగా పెరిగిన వైర‌స్ రోగుల తాకిడి..వీట‌న్నింటితో ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం మారిపోయింది. క‌రోనా ఎప్పుడు, ఎక్క‌డ‌, ఎవ‌రిని ఎలా కాటేస్తుందో అన్న భ‌యం క్ర‌మంగా పెరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *