రాష్ట్రంలో తాజాగా 7,754 కొవిడ్ పాజిటివ్ కేసులు..

హైద‌రాబాద్‌: ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ సెకండ్ వేవ్ విలాయ‌తాడం చేస్తుంది. గ‌డ‌చిన 24 గంట‌ల్లో 7,754 కొవిడ్ పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శ‌నివారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,43,360కి చేరింది, తాజాగా 6,542 మంది బాధితులు డిశ్చార్జి అవ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు 3,62,260 మందికోలుకున్నారు. మ‌రో 51 మంది కొవిడ్ మ‌హ‌మ్మారి బారినుండి ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 2,312 కు చేరింది. ఇప్పుడు రాష్ట్రంలో 78,888 యాక్టివ్ కేసులున్నాయ‌ని వైద్య‌, ఆరోగ్య‌శాఖ తెలిపింది. రాష్ట్రంలో మ‌ర‌ణాల రేటు 0.52శాతంగా ఉంద‌ని, రిక‌వ‌రీ రేటు 81.68 శాతంగా ఉంద‌ని పేర్కొంది. నిన్న ఒకే రోజు రాష్ట్రంలో 77,930 టెస్టులు చేసినట్లు చెప్పింది. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ ఎంసీలో 1,507 ఉన్నాయి. ఆ త‌రువాత మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరిలో 630, రంగారెడ్డిలో 554, సంగారెడ్డిలో 325, సూర్యాపేట‌లో 242, వికారాబాద్‌లో 242, న‌ల్ల‌గొండ‌లో 231,ఖ‌మ్మంలో 230, మంచిర్యాల‌లో 216, వ‌రంగ‌ల్ రూర‌ల్ 208 పాజిటివ్ కేస‌లు రికార్డ‌య్యాయ‌ని ఆరోగ్య‌శాఖ వివ‌రించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *