తెలంగాణ రాష్ట్రంలో తాజాగా 684 కొవిడ్ కేసులు న‌మోదు….

హైద‌రాబాద్‌: త‌తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ మ‌హ‌మ్మారి రోజురోజుకి పెట్రేగిపోతుంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 684 పాజిటివ్ కేసులు రికార్డ‌య్యాయ‌ని తెలంగాణ వైద్య ఆరోగ్య‌శాఖ బుధ‌వారం హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. వైర‌స్ ప్ర‌భావంతో మ‌రో ముగ్గురు మృత్యువాత‌ప‌డ్డారు. తాజా వైర‌స్ నుంచి 394మంది బాధితులు కోలుకొని ఇండ్ల‌కు వెళ్లారు. ఇప్పుడు రాష్ట్రంలో 4,665 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పుడు 1,873 మంది బాధితులు హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు. తాజాగా రికార్డ‌యిన కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 184 ఉన్నాయి. మంగ‌ళ‌వారం రాష్ట్రంలో 56,122 టెస్టులు చేసిన‌ట్లు వైద్య ఆరోగ్య‌శాఖ వివ‌రించింది. కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,889కు చేర‌గా.. 3,01,227, మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,697కు పెరిగింది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా అంద‌రూ కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని ,బ‌హిరంగ ప్ర‌దేశాల్లోమాస్క్ ధ‌రించాల‌ని వైద్య‌, ఆరోగ్య‌శాఖ సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *