రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో తాజా 1,436 క‌రోనా న‌మోదు….

హైద‌రాబాద్: ఇప్పుడు క‌రోనా సెంక‌డ్ వేవ్ చాలా విప‌రీతంగా వ్యాప్తిచెంద‌ని తెలిసిన విష‌య‌మే. తెలంగాణ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో తాజాగా 1,436 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనాతో14 మంది మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 27,016 క‌రోనా యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణ‌లో క‌రోనా నుండి 3,614 మంది బాధితుల కోలుకున్నారు. తెలంగాణ‌లో ఆదివారం 97,751 మందికి క‌రోనా ప‌రిక్ష‌లు చేశారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో 184 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. మ‌రోవైపు రాష్ట్రంలో బ్లాక్ ఫంగ‌స్ త‌గ్గుముఖం ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. గ‌త వారం ప‌ది రోజుల‌తో పోలిస్తే..ఇప్పుడు ఆ స్థాయిలో కేసులు న‌మోదు కావ‌డం లేదు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌తోపాటు ప్రైవేటులోనూ తాజా కేసులు త‌క్కువ‌గానే వ‌స్తున్నాయ‌ని వైద్య వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే మ‌రో నెల రోజుల వ‌ర‌కు కేసులు న‌మోద‌వుతూనే ఉంటాయ‌ని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *