హ‌త్య‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోక‌‌పోతే వెంట‌నే ఉద్య‌మిస్తాము….

హైదరాబాద్‌: రోడ్డుపై ప్ర‌జ‌లు తిరుగుతున్న స‌మ‌యంలో ఇంత ఘోర‌మా న్యాయ‌వాద దంప‌తులను అతి దారుణంగా హ‌త్య చేస్తారా ఇది ఏక్క‌డిన్యాయం.ఈ హ‌త్య‌ల వెనక అధికార పార్టీ హ‌స్తం ఉంద‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. హైద‌రాబాద్‌లోని గాంధీ భ‌వ‌న్‌లో ఉత్త‌మ్ మీడియాతో మాట్లాడారు. నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోక‌పోతే ఉద్య‌మిస్తామ‌ని హెచ్చ‌రించారు. ఈ కేసును సీబీఐతో విచార‌ణ జ‌రిపించాల‌ని.. ఈమేర‌కు హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిని క‌లిసి ఫిర్యాదు చేస్తామ‌న్నారు. ఈ అంశంపై సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి లేఖ రాస్తామ‌న్నారు. రాష్ట్రంలో కొంత మంది పోలీసు ఉన్న‌తాధికారులు దిగ‌జారి ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ..తెరాస‌కు అనుకూలంగా వ్య‌వ‌హారిస్తున్నార‌ని ఉత్త‌మ్ మండిప‌డ్డారు. అలాంటి వారంద‌రూ ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని చెప్పారు. న్యాయ‌వాద దంప‌తుల హ‌త్య‌కు సంబంధించి నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన పోలీసు అధికారుల‌పై 24 గంట‌ల్లోగా చ‌ర్య‌లు తీసుకొని, స‌స్పెండ్ చేయాల‌ని డిమాండ్ చేశారు. న్యాయ‌వాద దంప‌తుల హ‌త్య న్యాయ వ్య‌వ‌స్థ‌పై తెరాస చేసిన అతిపెద్ద దాడిగా అభివ‌ర్ణించారు. సీఎం కేసీఆర్ మౌనం ఆ విష‌యాన్ని తేట‌తెల్లం చేస్తోంద‌ని ఆక్షేపించారు. తెరాస‌,సీఎం కేసీఆర్‌కు రాష్ట్రంలోని న్యాయ‌వాదులంద‌రూ బుద్ధి చెప్పాల్సిన స‌మ‌య‌మిద‌ని ఉత్త‌మ్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *