రైతుల‌కు అన్యాయం చేసే సాగు చట్టాలు…..

ఢిల్లీ:గ‌ణ‌తంత్ర దినోత్స‌వం నాడు ఎర్ర‌కోట‌పై జెండా ఆవిష్క‌ర‌ణ జ‌రిగిన కొంత సేప‌టి రైతులు ట్రాక్ట‌ర్ల‌తో ర్యాలీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎర్ర‌కోట ప్ర‌గ‌నంలో రైతుల‌కు పోలీసుల‌కు మ‌ధ్య హింసాత్మ‌క సంఘ‌ర్ష‌ణ జ‌రిగింది.దీనితో రైతుల ఆందోళ‌నపై కేంద్రం అణ‌చివేత ధోర‌ణి సరికాద‌ని కాంగ్రెస్ ఎంపీ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కేంద్రం తెచ్చిన సాగు చ‌ట్టాలు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారు. రాష్ట్రాల ప‌రిధిలోని అంశాన్ని కేంద్రం ఏక‌ప‌క్షంగా మార్చేసింద‌ని తెలిపారు. మోదీ ప్ర‌భుత్వానికి మ‌ద్ధ‌తు ధ‌రపై చిత్త‌శుద్ధి లేద‌ని పేర్కొన్నారు. రైతులు మ‌ద్ధ‌తు ధ‌ర‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త కోరుతున్నార‌న్నారు. బీజేపీతో టీఆర్ఎస్ చీక‌టి ఒప్పందం బ‌య‌ట‌ప‌డింద‌ని వెల్ల‌డించారు. సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్షాలు రాష్ట్రప‌తి ప్ర‌సంగాన్ని బ‌హిష్క‌రిస్తే…. టీఆర్ ఎస్ మాత్రం స్పందించ‌కుండా బండారాన్ని బ‌య‌ట‌పెట్టుకుంద‌ని ఉత్త‌మ్ విమ‌ర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *