నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌- జోన‌ల్ వ్య‌వ‌స్థ‌లో ఉద్యోగాలు

హైద‌రాబాద్ : రాష్ట్రంలో నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌, భ‌ర్తీకి జోన‌ల్ వ్య‌వ‌స్థ‌లో రాష్ట్రప‌తి ఉత్త‌ర్వుల‌కు చేప‌ట్టిన సవ‌ర‌ణ‌లు త్వ‌ర‌లో అమ‌లు కానున్నాయి. దీనికి సంబంధించిన ఫైల్ కేసీఆర్ ద‌గ్గ‌రికి వెళ్లింది. ఆయ‌న సంత‌కం చేయ‌గానే స‌వ‌ర‌ణ ఉత్త‌ర్వుల‌ను అమ‌ల్లోకి తెస్తూ రాష్ట్ర స‌ర్కారు గెజిట్ విడుద‌ల చేస్తుంది. అప్ప‌టి నుండి జోన‌ల్ వ్య‌వ‌స్థ‌లో చేప‌ట్టిన సవ‌ర‌ణ‌లు అమ‌ల్లోకి వ‌స్తాయి. దీని ప్ర‌కారం గ‌తంలో 31 జిల్లాల‌కు ఉన్న జోన‌ల్ ఉత్త‌ర్వులు 33 జిల్లాల‌కు వ‌రిస్తాయి.5శాతంలోనూ తెలంగాణ నిరుద్యోగ యువ‌త‌పోటీ ప‌డ‌వ‌చ్చు. 2018 ఎన్నిక‌ల త‌రువాత ములుగు, నారాయ‌ణ‌పేట జిల్లాల‌ను ఏర్పాటు చేశారు.జోగులాంబ జోన్‌లో ఉన్న వికారాబాద్ జిల్లాకు చార్మినార్ జోన్‌లో క‌లిసారు. కొత్త‌గా జోన‌ల్ వ్య‌వ‌స్థ‌లో నియామాకాల‌న్నీ తెలంగాణ నిరుద్యోగ యువ‌త‌కే ల‌భిస్తాయి. త్వ‌ర‌లో ఉద్యోగాల భ‌ర్తీ కూడా చేప‌ట్ట‌నున్నారు. తాజాగా జోన‌ల్ వ్య‌వ‌స్థ‌లో 95శాతం స్థానిక రిజ‌ర్వేష‌న్లు, 5శాతం ఓపెన్ క్యాట‌గిరీని పొందుప‌రిచారు. నియామ‌కాల్లో తెలంగాణ యువ‌త‌కే పూర్తి స్థాయిలో ఉద్యోగాలు ద‌క్కేలా సీఎం కేసీఆర్ అన్ని వ‌ర్గాల‌లో సుదీర్ఘంగా క‌స‌ర‌త్తు చేసి, ఓపెన్ క్యాట‌రిగీని 5శాతానికే ప‌రిమితం చేశారు. దీంతో ఉద్యోగాల‌న్నీ తెలంగాణ నిరుద్యోగుల‌కే ద‌క్క‌నున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *