అన్న‌దాత‌ల‌కు శుభవార్త వ‌చ్చే నెల 15 నుండి రైతులు బంధు..

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు వ‌చ్చిన వ్య‌వ‌సాయ రంగాన్ని అభివృద్ధి ద‌శ‌లో ముందుకు తీసుకుపోవ‌డానికి నిరంత‌రం కృషి చేస్తాని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.క‌రోనా మ‌హ‌మ్మారి వ‌లన రాష్ట్రానికి ఆర్థికంగా న‌ష్ట‌వ‌చ్చినప్ప‌టికి వ్య‌వ‌సాయ రంగానికి నిధులు కేటాయిస్తామ‌న్నారు.మిష‌న్ కాక‌తీయ‌తో పాటు, సాగునీటి ప్రాజెక్టుల‌ను నిర్మించి ,కోటి ఎక‌రాల మాగాణాగా తెలంగాణ‌ను తీర్చిదిద్ద‌డంలో విజ‌యం సాధించామ‌ని, వ్య‌వ‌సాయ రంగం ముఖ‌చిత్రాన్ని గుణాత్మ‌కంగా మార్చాల‌ని పేర్కొన్నారు. ఎవ‌రెన్ని అడ్డంకులు సృష్టించినా, కాళేశ్వ‌రం లాంటి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప‌ట్టుప‌ట్టి పూర్తి చేశామ‌ని అన్నారు. వ్య‌వ‌సాయ రంగంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేడు ప్ర‌గ‌తి భ‌వ‌న్లో స‌మీక్షా నిర్వ‌హించారు.
వ‌చ్చి నెల‌15 నుండి 25వ తేదీ లోప‌ల రైతు బంధు పంట‌సాయం కింద తెలంగాణ స‌ర్కారు అందించే ఆర్థికసాయాన్ని రైతుల ఖాతాల్లో జ‌మ‌చేయాల‌ని సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిని ఆదేశించారు. గ‌త యాసంగిలో అవ‌లంబించిన విధానాన్నే ప్ర‌స్తుతం కూడా అవ‌లంబిస్తూ రైతుల ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ చేయాల‌ని సూచించారు. ఇప్ప‌టిదాకా ఇచ్చిన కేట‌గిరీల వారిగానే రైతు బంధు సాయాన్ని ఖాతాలో వేయాల‌న్నారు. కాగా జూన్ 10వ తేదీని క‌టాఫ్ డేట్‌గా పెట్టుకొని, ఆ తేదీ వ‌ర‌కూ పార్ట్ బీ నుండి పార్ట్ ఏలోకి చేరిన భూముల‌కు రైతుబంధు వ‌ర్తింపు చేయాల‌ని సీఎం ఆదేశించారు.ఖ‌రీఫ్ వ్య‌వ‌సాయ సీజ‌న్ ప్రారంభ కానున్న సంద‌ర్భ‌రంలో ముఖ్య‌మంత్రి సీఎం అధికారులకు కీల‌క ఆదేశాలిచ్చారు. నాణ్య‌మైన విత్త‌నాల‌ను రైతుల‌కు అందుబాటులోకి తేవాల‌ని సీఎం ఆదేశించారు. క‌ల్తీ విత్త‌నాల మీద ఉక్కుపాదం మోపాల‌ని పోలీసు అధికారుల‌ను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *