ఎంజీఎం ఆస్ప‌త్రికి చేరుకుని అక్క‌డి ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించారు….

హైదరాబాద్‌: ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ చాలా వేగం వ్యాపిస్తుంది. ఇలాంటి త‌రుణంలో రాష్ట్ర ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవ‌డానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌దైన శైలిలో మొద‌ట గాంధీ ఆస్ప‌త్రిని ప‌రిశీలించారు. అక్క‌డ ఉన్నక‌రోనా రోగులను అడిగి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొని వారికి స‌రైన ప‌ద్ద‌తిలో వైద్యం అందించాల‌న్నారు. నేడు వ‌రంగ‌ల్ ఎంజీఎం ఆస్ప‌త్రికి చేరుకుని అక్క‌డి ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించారు. కొవిడ్ బాధితుల‌కు అందుతున్న వైద్య సేవ‌ల‌ను ఆయ‌న అడిగి తెలుసుకున్నారు. ఆస్ప‌త్రిలో ప‌డ‌క‌లు, ఆక్సిజ‌న్‌, వెంటిలేట‌ర్లు, రెమ్‌డెసివిర్, ఇత‌ర మందుల ల‌భ్య‌త త‌దిత‌ర అంశాల‌పై అధికారుల‌తో సీఎం చ‌ర్చించ‌నున్నారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో కొవిడ్ కేసుల క‌ట్ట‌డికి చేప‌డుతున్న చ‌ర్య‌ల‌పై కేసీఆర్ స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *