1500 కిపైగా అరుదైన ఛాయాచిత్రాల‌తో ఫోటో ఎగ్జిబిష‌న్…

హైద‌రాబాద్‌: తెలంగాణ స‌ర్కార్ నిర్వ‌హిస్తున్న స్వ‌తంత్ర‌భార‌త అమృతోత్స‌వాలులో భాగంగా తెలంగాణ స‌ర్కార్ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వ‌ర్యంలో భార‌త‌దేశ స్వాతంత్ర పోరాటం పై ఛాయాచిత్ర ప్ర‌ద‌ర్శ‌న ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌రరావు ఆదేశాల మేర‌కు నిర్వ‌హిస్తున్నారు.1857 నుండి 1950 వ‌ర‌కు జ‌రిగిన భార‌త‌దేశ స్వాతంత్య్ర పోరాటాన్ని వ‌ర్ణించే 1500 కిపైగా అరుదైన ఛాయాచిత్రాల‌తో ఫోటో ఎగ్జిబిష‌న్ నిర్వ‌హిస్తున్నామ‌ని ఉత్స‌వాల క‌మిటీ చైర్మ‌న్‌, ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు, డా, కెవి ర‌మ‌ణాచారి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈనెల‌9న సాయంత్రం 4.45 నిల‌కు హైద‌రాబాద్,మాదాపూర్ లోని స్టేట్ ఆర్ట్ గ్యాల‌రీలో ప్రారంభ‌మ‌య్యే ఈఫోటో ఎగ్జిబిష‌న్ ఏప్రిల్ 15వ‌ర‌కు నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు. ఈ ఎగ్జిబిష‌న్ లో 1857 నుండి 1904 వ‌ర‌కు జ‌రిగిన సిపాయిల తిరుగుబాటు, 1905 వందేమాత‌రం ఉద్య‌మం నుండి 1919 లోజ‌రిగిన జ‌లియన్వాలాబాగ్ ఊచ‌కోత వ‌ర‌కు, 1920 నాటి స‌హాయ నిరాక‌ర‌ణ ఉద్య‌మం నుండి 1929 నాటి పూర్ణ స్వ‌రాజ్ ప్ర‌క‌ట‌న వ‌ర‌కు1930 శాస‌నోల్లంఘ‌న ఉద్య‌మం (దండిమార్చి ఉప్పు స‌త్యాగ్ర‌హం) నుండి 1941 వ‌ర‌కు, 1942 నాటి క్విట్ ఇండియా ఉద్య‌మం నుండి 1947 భార‌త‌స్వాతంత్య్రం వ‌ర‌కు 1947 నుండి 1950 లో భార‌త రాజ్యాంగాన్ని స్వీక‌రించి, స్వ‌యం పాల‌న ప్రారంభ‌ద‌శ వ‌ర‌కు అనేక సంఘట‌న‌ల‌కు సంబంధించిన ఛాయాచిత్రాల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నామ‌ని అన్నారు. పూర్తిగా క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ 7 రోజుల‌పాటు నిర్వ‌హిస్తున్న ఫోటో ఎగ్జిబిష‌న్ ను తెలంగాణ శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప్రారంభిస్తార‌ని, విద్యార్థులు, యువ‌త‌, పోటీ ప‌రీక్ష‌లు అభ్య‌ర్థులు , ప్ర‌జ‌లు ఈ ఎగ్జిబిష‌న్‌ను సంద‌ర్శించి ఆనాటి భార‌తదేశ స్వాతంత్య్రం పోరాట సంగ్రామాన్ని దృశ్య‌రూపంలో చూసే అవ‌కాశాన్ని స‌ద్వినియోగ‌ప‌ర‌చుకోవాల‌ని ర‌మాణాచారి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *