ప్ర‌గ‌తి ప‌థంలో మ‌హిళాల‌దే అత్యంత కీల‌క పాత్ర‌-సీఎం

హైద‌రాబాద్‌: తెలంగాణ ప్ర‌భుత్వం మ‌హిళాలను అభివృద్ధి ప‌థంలో న‌డిపించేందుకు త‌గ్గ‌న చ‌ర్యలు తీసుకుంటున్న‌ట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈనెల 8 మ‌హిళ అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సందర్భంగా మ‌హిళాలోకానికి సీఎం శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌గ‌తి ప‌థంలో మ‌హిళ‌ల‌ది అత్యంత కీల‌క పాత్ర అని కొనియాడారు. మ‌హిళ‌లు పురుషుల‌తో స‌మానంగా అన్ని రంగాల్లో పోటీప‌డుతూ త‌మ ప్ర‌తిభ‌ను చాటుకుంటున్నార‌ని పేర్కొన్నారు. జ‌నాభాలో స‌గంగా ఉన్న మ‌హిళ‌ల‌కు అవ‌కాశాలు ఇస్తే అద్బుతాలు చేసి చూపిస్తార‌న్నారు. మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం షీటీమ్స్ , వితంతువుల‌, ఒంట‌రి మ‌హిళ‌లు, వృద్దుల కోసం పింఛ‌న్లు, క‌ళ్యాణ‌ల‌క్ష్మీ ,షాదీముబార‌క్‌, కేసీఆర్ కిట్‌, అంగ‌న్వాడీ కార్య‌క‌ర్త‌ల‌కు వేత‌నాల పెంపు స‌హా మ‌హిళా సాధికార‌త‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అనేక ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంద‌ని చెప్పారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా సోమ‌వారం రాష్ట్రంలోని ప్ర‌భుత్వ మ‌హిళా ఉద్యోగుల‌కు సీఎం కేసీఆర్ సెల‌వు ప్ర‌క‌టించారు. సీఎం ఆదేశాల మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్రధాని కార్య‌ద‌ర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *