క‌రోనా కేసులు త‌క్కువ అవ‌డానికి ప్ర‌భుత్వం త‌గ్గిన చ‌ర్య‌లు……

హైదరాబాద్: ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో క‌రోనా సెకండ్ వేవ్ విలాయ‌తాడ‌వం చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజు పెరుగుతున్న క‌రోనా కేసులు త‌క్కువ అవ‌డానికి ప్ర‌భుత్వం త‌గ్గిన చ‌ర్య‌లు తీసుకోవాలి. హెల్త్ ఎమ‌ర్జెన్సీ విధించాల‌ని బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కుమార్ అన్నారు. నేడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ ప‌రిస్థితుల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ వెంట‌నే ఉన్న‌తాధికారుల స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. వైద్య‌, ఆరోగ్య‌శాఖ‌ను తీసుకుని ఫాంహౌస్‌లో కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. వైద్య‌, ఆరోగ్య‌శాఖ‌ను తీసుకొని ఫాంహౌస్ కేసీఆర్ కూర్చుకుంటే ఉప‌యోగంలేద‌న్నారు. క‌క్ష సాధింపుల‌కు ముఖ్య‌మంత్రి ఉన్న స‌మ‌యం.. ప్ర‌జ‌ల ఆరోగ్యంపై లేక‌పోవ‌టం బాధాక‌ర‌మ‌ని చెప్పారు.కొవిడ్ నియంత్ర‌ణ కోసం కూడా న‌లుగురు ఐఏఎస్ అధికారుల‌ను నియ‌మిస్తే ఆనందిస్తామ‌న్నారు. ఆక్సిజ‌న్ బ్లాక్ మార్కెట్, ఆస్ప‌త్రుల దో పిడీని అడ్డుకోవ‌టంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని బండి సంజ‌య్ కుమార్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.వ్య‌క్తం చేశారు. పాల‌కుల‌ను మాన‌త్వం లేకుంటే ప్ర‌జ‌ల ప్రాణాల‌కే ముప్ప‌ని చెప్పారు. శ్మ‌శాన‌వాటిక‌లో కెమెరాలు ఏర్పాటు చేస్తే తెలంగాణ‌లోవాస్త‌వ ప‌రిస్థితులు తెలుస్తాయ‌న్నారు. క‌నీసం మారు వేషంలోనైనా కేసీఆర్ ఆస్ప‌త్రుల‌ను ప‌రిశీంచాల‌ని కోరుకుంటున్నామ‌ని అన్నారు. రాష్ట్రాల హ‌క్కుల్లో కేంద్రం క‌ల‌గ‌జేసుకోద‌ని తెలిపారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉంటేనే ప్ర‌జ‌ల ఆరోగ్యం బాగుంటోంద‌ని బండి సంజ‌య్‌కుమార్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *