ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీజేపీదే గెలుపు…

హైద‌రాబాద్ః వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం-న‌ల్గొండ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన తీరుతామ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ధీమా వ్య‌క్తం చేశారు. శ‌నివారం జిల్లాలో నిర్వ‌హించిన ఎమ్మెల్సీ స‌న్నాహ‌క స‌మావేశంలో సంజ‌య్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగుల‌కు రూ.7200 వేల బాకాయి చెల్లించిన త‌రువాతే ఓట్లు అడిగేందుకు టీఆర్ ఎస్ రావాల‌ని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ ఉపాధ్యాయుల ప‌రిస్థితి బిక్షం ఎత్తుకునే దుస్థితి వ‌చ్చింద‌ని వ్యాఖ్యానించారు. నిరుద్యోగులు,ప్రైవేట్ ఉపాధ్యాయులు బీజేపీ గెలుపు కోసం ప‌ని చేసేంద‌కు సిద్ధంగా ఉన్నార‌ని తెలిపారు. టీఆర్ఎస్ ప్ర‌భ్వుతం మాయ మాట‌ల‌తో విసిగిపోయిన ప‌ట్ట‌భ‌ద్రులు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. బీజేపీ గెలుపు కోసం వారు ప‌ని చేసేందుకు సిద్ధంగా ఉన్నార‌ని.. వారి అండ‌తో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీజేపీది గెలుపు ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *