గ‌డిలా పాల‌న‌ను అంతం చేసే పార్టీ బీజేపీ…

హైద‌రాబాద్‌: త‌ఎతెలంగాణ రాష్ట్ర కార్యాల‌యంలో పార్టీ ఆవిర్భావ‌దినోత్స‌వం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో పార్టీ జండా ఆవిష్క‌రించారు. రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. అనేక మంది కార్య‌క‌ర్త‌ల త్యాగాల ఫ‌లిత‌మే బీజేపీ నేడు ఈ స్థాయికి చేరింద‌ని..2 స్థానాల నుంచి 303 స్థానా వ‌ర‌కు బీజేపీ ఎదిగింద‌ని పేర్కొన్నారు. అధికారం కోసం బీజేపీ ఎప్పుడు ప‌ని చేయ‌లేద‌ని… పేద ప్ర‌జ‌ల కోసం, దేశం కోసం బీజేపీ అధికారంలోకి రావాల‌ని అనుకుంద‌న్నారు. అట‌ల్ బిహారి వాజ్ పేయ్ ఒక్క ఓటుతో అధికారాన్ని వ‌దులుకున్నార‌ని … అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను. కేంద్రం ప్ర‌వేశ పెడుతుంద‌న్నారు. బీజేపీ లేనీ పార్టీని దేశ ప్ర‌జ‌లు ఉహించుకోవ‌డం క‌ష్ట‌మ‌ని.. తెలంగాణ‌లో టీఆర్ ఎస్ ను ఎదుర్కొనే పార్టీ బీజేపీ అని స్ప‌ష్టం చేశారు. గ‌డిలా పాల‌నను అంతం చేసే పార్టీ బీజేపీ అని2023లో బీజేపీ ని తెలంగాణ లో అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌ని పిలుపుచ్చారు బండిసంజ‌య్‌. ఛ‌త్తీస్ ఘ‌డ్ లోబీజేపీ పార్టీ అధికారంలోకి వ‌స్తే ఉగ్ర‌వాదం, తీవ్ర వాదాన్ని అణిచివేస్తుంద‌ని ..అక్క‌డ కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఏం జ‌రిగిందోచూసామ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *