క‌రోనా పై యుద్ధ ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు చేప‌ట్టాలి..

హైద‌రాబాద్: ఇప్పుడు క‌రోనా క‌ర‌ళానృత్యం చేస్తుంది. రాష్ట్రంలో ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో వైద్యానికి ధ‌ర‌లు నిర్ణ‌యించ‌మ‌ని హైకోర్టు ఆదేశించినా ఆ మేర‌కు చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేద‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క అన్నాఉ. సీఎం దీనిపై టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తూ జీవోఇచ్చార‌ని గుర్తు చేశారు. ఆ టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుందో తెలియ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భ‌ట్టి విక్ర‌మార్క జూమ్ యాప్ ద్వారా మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. కొవిడ్ ఉద్దృతిపై సీఎంకు ఫోన్ చేసి అప్ర‌మ‌త్తం చేయ‌మ‌ని చెప్పినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆయ‌న ఆరోపించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేద‌ని సీఎం అన్నార‌ని..హైకోర్టు ఒత్తిడితోనే లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నార‌న్నారు.కొవిడ్ క‌ట్ట‌డిపై ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు ప్ర‌జ‌ల‌ను గంద‌ర‌గోళానికి గురి చేస్తున్నాయ‌ని బ‌ట్టి విక్ర‌మార్క విమ‌ర్శించారు. వ్యాక్సిన్ త‌యారీ కంపెనీల‌తోరాష్ట్ర ప్ర‌భుత్వం మాట్లాడిన త‌రువాత వికేంద్రీక‌ర‌ణ చేయాల‌న్నారు.తెలంగాణ హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించి..యుద్ధ ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. ఇప్పుడు ప‌రిస్థితుల్లో గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకొని రాష్ట్ర ప‌రిపాల‌న‌పై దృష్టి సారిస్తార‌ని ఆశిస్తున్న‌ట్లు భ‌ట్టి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *