కొవిడ్ టీకా తీనుకున్నా విరాట్ కోహ్లీ..

ముంబై: భార‌త్ జ‌ట్టు సార‌థి విరాట్ కోహ్లీ కొవిడ్ వ్యాక్సిన్ తొలిడోసు తీసుకున్నాడు. అత‌ను వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన కోహ్లీ.. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, సాధ్య‌మైనంత త్వ‌ర‌గా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని సూచించారు. వ‌చ్చే నెల‌లో న్యూజిలాండ్‌తో జ‌ర‌గ‌బోయే డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ కోసం భార‌త్ జ‌ట్టు త్వ‌ర‌లోనే ఇంగ్లండ్ వెళ్ల‌నుంది. ఆలోపే ఆ జ‌ట్టులోని ప్లేయర్స్ అంద‌రూ త‌మ తొలి డోసు వ్యాక్సిన్ తీసుకోవాల‌ని భావిస్తున్నారు. అటు సీనియ‌ర్ పేస్ బౌల‌ర్ ఇషాంత్ శ‌ర్మ కూడా త‌న భార్య ప్ర‌తిమా సింగ్ తో క‌లిసి వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఇప్ప‌టికే శిఖ‌ర్ ధావ‌న్‌, ర‌హానే, ఉమేష్ యాద‌వ్ లాంటి వాళ్లు కొవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్నారు. ఐపీఎల్ వాయిదా ప‌డ‌గానే ఇంటికెళ్లి పోయినా కోహ్లీ.. ఆ వెంట‌నే క‌రోనా స‌హాయ‌క కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంతోపాటు త‌న‌వంతుగా రూ.2 కోట్లు విరాళ‌మిచ్చాడు. భార్య అనుష్క శ‌ర్మ‌తో క‌లిసి మ‌రిన్ని విరాళాలు సేక‌రిస్తున్నాడు. ‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *