తండ్రి క‌ల నెర‌వేర్చేండం కోసం అత‌డు అక్క‌డే ఉండిపోయాడు…..

ముంబై: భార‌త్ జ‌ట్టు కోచ్ ర‌విశాస్త్రి తండ్రిని కోల్పోయిన బాధ‌లో ఉన్న‌ప్పుడు ఓదార్చ‌డ‌మే కాకుండా, క‌చ్చితంగా ఐదు వికెట్లు తీస్తావ‌ని త‌న‌లో ధైర్యం నింపాడ‌ని భార‌త్ జ‌ట్టు యువ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ పేర్కొన్నాడు. ఈ బాధ‌క‌ర స‌మ‌యంలో బౌలింగ్ కోచ్ భార‌త్ అరుణ్ తో క‌లిసి ర‌విస‌ర్ త‌న‌కు అండ‌గా నిలిచారని ,వారే లేక‌పోయుంటే ఆసీస్ ప‌ర్య‌ట‌న నుండి వైదొలిగేవాడిన‌ని చెప్పుకొచ్చాడు. తండ్రి మ‌ర‌ణ‌వార్త తెలియ‌గానే విరాట్ భాయ్ త‌న‌ను కౌగిలించుకుని ఓదార్చ‌డ‌ని, కోచ్ ర‌వి స‌ర్ ఆ స‌మ‌యంలో త‌న‌తో మాట్లాడిన మాట‌ల‌ను జీవితాంతం మార్చిపోలేన‌ని వెల్ల‌డించారు. నువ్వు దేశం త‌ర‌పున టెస్ట్ ఆడాల‌ని నీ తండ్రి క‌ల‌గ‌న్న‌డాని, ఆ అవ‌కాశం ప్ర‌స్తుతం నీకు వ‌చ్చింద‌ని, ఈ స‌మ‌యంలో నీతండ్రి లేకపోయినా అత‌ని ఆశీర్వాదం నీతో ఉంటుంద‌ని, ఆయ‌న నాలో స్పూర్తిని ర‌గిల్చార‌ని గుర్తు చేసుకున్నాడు. మ్యాచ్ ముగిసాక ర‌వి స‌ర్ త‌న‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తిన సంగ‌తీన్ని త‌ల‌చుకుని క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యాడు. ఇప్పుడు ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న నిమిత్తం లండ‌న్‌కు బ‌ట‌య‌ల్దేరిన సిరాజ్‌.. ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌గా నవంబ‌ర్ 20న తండ్రిని కోల్పోయాడు. క్వారంటైన్ ఆంక్ష‌లు ఉండ‌టం,టెస్టు క్రికెట్ ఆడాల‌న్న తండ్రి క‌ల నెర‌వేర్చేండం కోసం అత‌డు అక్క‌డే ఉండిపోయి, తండ్రి అంత్య‌క్రియ‌ల‌కు సైతం హాజ‌రు కాలేకపోయాడు. తండ్రి క‌ల‌ను నెర‌వేర్చేందుకు దుఃఖాన్ని దిగ‌మింగి బ‌రిలోకి దిగిన ఈ హైద‌ర‌బాదీ క్రికెట్‌, ఆసీస్‌తో టెస్ట్ సిరీస్ మ‌ర‌పురాని అనుభూతుల‌ను మిగిల్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *