జ‌డేజా ఫీల్డింగ్ నైపుణ్యం…

మెల్ బోర్న్ః ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో టీమ్ ఇండియా ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర‌జ‌డేజా ఫీల్డింగ్ విన్యాసం అంద‌రినీ ఆక‌ట్టుకున్న‌ది. మెలోబోర్న్ వేదిక‌గా జ‌రుగుతున్న బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొద‌ట బ్యాటింగ్ ఎంచుకున్న‌ది. తొలి రోజు ఆట‌లోఆసీస్ ఇన్నింగ్స్ 13వ ఓవ‌ర్లో జ‌డేజా అద్భుత క్యాచ్‌కు ఆస్ట్రేలియా ఓపెన‌ర్ మ‌థ్యూవేడ్ వెనుదిరిగాడు. అశ్విన్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేంద‌కు మ‌థ్యూ ప్ర‌య‌త్నించ‌గా బంతిగాల్లో లేచింది. ఈ బాల్‌ను అందుకునేందుకు జ‌డ్డూ తోపాటు శుభ్‌మ‌న్‌గిల్ కూడా ప‌రుగెత్తాడు. బంతివైపు చూస్తూ ప‌రుగెత్తిన జ‌డ్డూ తాను క్యాచ్ అందుకుంటాన‌ని చేతుల‌తో సిగ్న‌ల్ ఇవ్వ‌గా దీన్ని గిల్ చూడ‌లేదు. ఇద్ద‌రూ క్యాచ్ కోసం పోటిప‌డ‌గా జ‌డేజా మాత్రం గిల్‌ను బ‌లంగా సిగ్న‌ల్ ఇవ్వ‌గా దీన్ని గిల్ చూడ‌లేదు. ఇద్ద‌రూ క్యాచ్‌కోసం పోటీప‌డ‌గా జ‌డేజా మాత్రం గిల్ను బ‌లంగా ఢీకొన‌కుండా క్యాచ్ అందుకున్నాడు. ప్ర‌స్తుతం జ‌డ్డూ ఫీల్డింగ్ నైపుణ్యంపై సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *