ఆసీస్‌ను దెబ్బ‌కొట్టాలంటే శ‌క్త‌కి మించి శ్ర‌మిమ‌చాల్సిందే..

మెల్ బోర్న్ః ప్ర‌తిష్టాత్మ‌క బోర్డ‌ర్‌- గ‌వాస్క‌ర్ సిరీస్ లో తొలి మ్యాచ్ కోల్పోయి0-1తో వెనుక‌బ‌డ్డ భార‌త జ‌ట్టు శ‌నివారం నుంచి కంగారూల‌తో బాక్సింగ్ డే టెస్టు ఆడ‌నుంది. కీల‌క ఆట‌గాళ్లు దూర‌మ‌వ‌డంతో డీలాప‌డ్డ టీమ్ ఇండియా ..గ‌త ప‌ర్య‌ట‌న‌లో ఆసీస్ జ‌ట్టును త‌ల‌పిస్తున్న‌ది. తొలి టెస్టులో విఫ‌ల‌మైన పృథ్వీషా స్థానంలో అత‌డి స‌హ‌చ‌రుడు శుభ్‌మ‌న్‌గిల్ టెస్టు అరంగేట్రం చేయ‌నుండ‌గా… వికేట్ కీప‌ర్గావృద్ధిమాన్ సాహా స్థానంలో రిష‌బ్‌పంత్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. విరాట్ స్థానంలో లోకేష్ రాహుల్‌ను జ‌ట్టులోకి తీసుకుంటార‌ని అంతా భావిస్తే.. అందుకు భిన్నంగా ఆల్‌రౌండ్ ర‌వీంద్ర జ‌డేజాతో ఆచోటును భ‌ర్తీ చేశారు. అనుభ‌వ‌లేమి. ఆత్మ‌విశ్వాస లోపంతో ఇబ్బంది ప‌డుతున్న భార‌త జ‌ట్టు… ప‌టిష్టంగా ఉన్న ఆసీస్‌ను దెబ్బ‌కొట్టాలంటే శ‌క్త‌కి మించి శ్ర‌మిమ‌చాల్సిందే..
పిచ్‌,వాతావ‌ర‌ణం
ప‌చ్చిక త‌క్కువ‌గా ఉన్న ఫ్లాట్ పిచ్ బ్యాటింగ్‌కు స‌హ‌క‌రించే అవ‌కాశాలున్నాయి. తొలి రోజు వాతావ‌ర‌ణం
ఆహ్లాద‌ర‌కంగా ఉండ‌నుంది. రెండో రోజు 33 డిగ్రీల ఉష్టోగ్ర‌త‌తో పాటు తేలిక‌పాటి జ‌ల్లులు కురిసే అవ‌కాశం ఉంది. మిగిలిన మూడు రోజుల వాతావ‌ర‌ణం పొడిగా ఉండ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *