మూర్ఖ‌త్వంతోనే రాష్ట్రాన్నిఈ ప‌రిస్థితికి తీసుకొచ్చాడు..

అమ‌రావ‌తి: ఇప్పుడు ఏపీరాష్ట్రంలో కొవిడ్ సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తిస్తుంది.ఇలాంటి త‌రుణంలో క‌రోనా తీవ్ర‌త మ‌రీ ఎక్కువ‌గా ఉన్న చోట లాక్ డౌన్ పెట్టుకుని వెళ్లాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు సూచించారు. నేడు మీడియాతో మాట్లాడుతూ వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోసం జాతిని తాక‌ట్టుపెట్టొద్ద‌న్నారు. వివిధ దేశాల వైద్య నిపుణుల స‌హ‌కారంతో పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు క‌లిసి ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడేందుకు త‌మ వంతు సాయం చేస్తామ‌న్నారు. పార్టీ ప‌రంగా ఎంత‌వ‌ర‌కు సాయం చేయ‌గ‌లితే అంతే వ‌ర‌కూ చేస్తామ‌న్నారు. లాక్‌డౌన్ పెట్టాల‌నే ఆలోచ‌న‌లో స‌ర్వ‌త్రా ఉంటే ప‌రీక్ష‌లు పెట్టాల‌ని చూడ‌టం త‌గ‌ద‌ని వ్యాఖ్యానించారు. ప‌రీక్షా కేంద్రాల్లో జాగ్ర‌త్త‌లు తీసుకుంటే స‌రిపోద‌ని… విద్యార్థులకు రవాణా, ఇత‌ర సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని వ్యాఖ్య‌నించారు. 18సంవ‌త్స‌రాలు నిండిన వారికి టీకా ఇచ్చే విష‌యంలో ఎలాంటి జాగ్ర‌త్తలు తీసుకున్నార‌ని ప్ర‌శ్నించారు. దేశ‌వ్యాప్తంగా ప‌రీక్ష‌లు వాయిదా వేస్తే… జ‌గ‌న్ వారికంటే మేధావా అని నిల‌దీశారు. వితండ వాదం, మూర్ఖ‌త్వంతోనే రాష్ట్రాన్ని ఈ ప‌రిస్థితికి తీసుకొచ్చార‌ని చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *