భ‌యంక‌ర‌మైన క‌రోనా వైర‌స్‌- చంద్ర‌బాబు

అమ‌రావ‌తి: ఏపీరాష్ట్రంలో రోజురోజు పెరుగుతున్న కొవిడ్ కేసులు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత‌ల‌తో సోమ‌వారం టీడీపీ అధినేత నారాచంద్ర‌బాబునాయుడు స‌మావేశ‌మ‌య్యారు. అత్యంత ప్ర‌మాద‌క‌ర కొవిడ్ వైర‌స్ ఎన్‌440 కె ఏపీలో వ్యాపించింద‌న్నారు. మొద‌టిసారిగా సీసీఎంబీ శాస్త్ర‌వేత్త‌లు క‌ర్నూలులో గుర్తించార‌న్నారు. ఇత‌ర వైర‌స్‌ల క‌న్నా 10 రెట్లు ప్ర‌భావం ఎక్కువ చూపుతుంద‌ని చంద్ర‌బాబు తెలిపారు.
ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్‌కు చ‌ర్య‌లు చేపట్టాల‌ని తెలుగుదేశం డిమాండ్ చేసింది. ఇప్ప‌టికే 14 రోజుల పాటు ఒరిస్సా లాక్‌డౌన్‌ను ప్ర‌టించింద‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. వ్యాక్సినేష‌న్ కోసం ప‌లు రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆర్డ‌ర్లు పెట్టాయ‌న్నారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కారు మాత్ర‌మే ఏమీ చేసింద‌న్నారు. రంగుల కోసం రూ.3000 కోట్ల ప్ర‌భుత్వ నిధులు దుర్వినియోగం చేసింద‌న్నారు. గోరంత‌ల్ని కొండంత‌లుగా చేసిన ప్రచారం నిర్వ‌హిస్తోంద‌న్నారు. గ‌త ప్ర‌భుత్వంపై నింద‌లు వేయ‌డానికి సిగ్గులేద‌న్నారు.ప్ర‌జారోగ్యంపై ప్ర‌భుత్వం దృష్టి పెట్టాల‌న్నారు. వైద్యసిబ్బంది కొర‌త తీర్చ‌డానికి నియామ‌కాలు చేప‌ట్టాల‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *