టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కు మేముకూడా రేడి అంటున్నా శ్రీ‌లంక‌

హైదరాబాద్‌: సెప్టెంబ‌ర్‌లో ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌కు తాము కూడా సిద్ధ‌మే అని ఈ మ‌ధ్య‌కాలంలో శ్రీ‌లంక క్రికెట్ బోర్డు స్ప‌ష్టం చేసింది.బీసీసీఐ టీ20 వ‌రల్డ్ క‌ప్‌ను యూఏఈలో నిర్వ‌హించాల‌న్న ఉద్దేశంతో ఎమిరేట్స్ క్రికెట్ క్ల‌బ్‌తో మంత‌నాలు జ‌రుపుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే శ్రీ‌లంక క్రికెట్ కూడా ఆటోర్నీ నిర్వ‌హించేందుకు రేసులో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అంతేకాదు….బీసీసీఐతోనూ సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు ఓ మీడియా సంస్థ ద్వారా వెల్ల‌డైంది. యూఏఈలో ఇప్ప‌టికే ఐపీఎల్ మిగితా మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించ‌డం సాధ్య‌మా అన్న కోణంలో ఆలోచ‌న‌లు చేస్తున్నారు. యూఏఈలో కేవ‌లం షార్జా, దుబాయ్‌, అబుదాబిల్లో మాత్ర‌మే స్టేడియాలు ఉన్నాయ‌ని ,కానీ కొలంబోలోప‌ట్నంలోనూ మూడు స్టేడియాలు ఉన్న‌ట్లు ఒక‌రు తెలిపారు. ఒక వేళ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ను బ‌య‌ట నిర్వ‌హించాల‌నుకుంటే, అప్పుడు ప‌న్ను మిన‌హాయింపు కోసం ఐసీసీని సంప్ర‌దించాల్సి ఉంటుంద‌ని ,జూన్ 15న తేదీలో గా ఆ ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంద‌ని, ఈవెంట్ నిర్వ‌హ‌ణ కోసం ఐసీసీకి జూన్ 28వ తేదీలోగా చెప్పాల్సి ఉంటుంద‌ని కొన్ని వ‌ర్గాల ద్వారా వెల్ల‌డైంది. వ‌ర‌ల్డ్ క‌ప్ ఈవెంట్ బ‌య‌టి దేశంలో జ‌రిగినా.. ఈ హోస్టింగ్ రైట్స్ మాత్రం బీసీసీఐ వ‌ద్దే ఉంటాయ‌ని గ‌తంలో ఐసీసీ స్ప‌ష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *