ఐపీఎల్‌లో ఆడ‌క‌పోడం వ‌ల్ల తానేమీ బాధ‌ప‌డ‌టం లేద‌ని అన్నారు….

ముంబై ః పోయిన సంవ‌త్స‌రం జ‌రిగిన ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) నుంచి చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్లేయ‌ర్ సురేష్‌రైనా అర్థంత‌రంగా త‌ప్పుకోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. టోర్నీలో ఆడేందుకే దుబాయ్ వెళ్లిన రైనా అది మొద‌లు కాక‌ముందే తిరిగి ఇండియాకు వ‌చ్చేశాడు. అయితే తాను ఐపీఎల్ ఎందుకు ఆడ‌లేద‌న్న‌దానాపై ఎన్నో పుకార్లు వ‌చ్చినా ఇన్నాళ్లూ నోరు మెద‌ప‌ని రైనా తాజాగా కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఆడ‌క‌పోవ‌డానికి కాణాన్ని నేరుగా చెప్ప‌లేదు. కానీ…. టీమ్‌లోఏదైనా జ‌రిగిందాఅన్న అనుమానం క‌లిగేలా రైనా మాట్లాడాడు.
టీమ్ లోఏ జ‌రిగింది?
మ‌నం సంతోషంగా లేక‌పోతే వెన‌క్కివ‌చ్చేయాల‌నేది నా ఆలోచ‌న‌. నేను ఎవ‌రినీ ఏదో చేయాల‌ని ఒత్తిడి మ‌నం సంతోషంగా లేక‌పోతే స‌క్సెస్ అనేది నెత్తికెక్కుతుంది. క్రికెట‌ర్లు స‌హజంగానే అని అవుట్‌లుక్‌తో ఇంట‌ర్వ్యూలోరైనా అన‌డం విశేషం. ఇక ఐపీఎల్‌లో ఆడ‌క‌పోవ‌డం వ‌ల్ల తానేమీ బాధ‌ప‌డ‌టం లేద‌ని, త‌న పిల్ల‌లు , కుటుంబంతో గ‌డ‌ప‌డం సంతోషంగా ఉంద‌ని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంట‌ర్య్వూలో అత‌ను అన్నాడు. ఆ స‌మ‌యంలో నాకుటుంబానికి నేను అవ‌స‌రం. 20 ఏళ్లుగా నేను ఆడుతున్నా. కానీ అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో కుటుంబానికి మ‌నం అందుబాటులో ఉండాలి. అందుకే ఆ స‌మ‌యంలో ఐపీఎల్‌లో ఆడ‌కుండా వెన‌క్కివ‌చ్చేయ‌డ‌మే స‌రైన‌ద‌ని నాకు అనిపించింది. అని రైనా అన్నారు.అయితే దుబాయ్ హోట‌ల్‌లో రైనా బాల్క‌నీ ఉన్న రూమ్ కోసం అడిగాడ‌ని, అది కుద‌ర‌క‌పోవ‌డంతో అసంతృప్తి వల్లే తిరిగి ఇండియాకు వ‌చ్చాడ‌న్న వార్త‌లు వ‌చ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *