ఆర్థిక విధానాల్లో న్యాయ‌ప‌ర‌మైన స‌మీక్ష-మారటోరియంపై సుప్రీం తీర్పు

ఢిల్లీ: నేడు సుప్రీం కోర్టు ఆర్థిక ప్యాకేజీలు, ఉద్దీప‌న‌లు ప్ర‌క‌టించాల‌ని ప్ర‌భుత్వానికి ,రిజ‌ర్వ్‌బ్యాంకుకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయ‌లేమ‌ని స్ప‌ష్టం చేసింది. మార‌టోరియం కాలంలో రుణాల‌పై చ‌క్ర‌వ‌డ్డీని పూర్తిగా మాఫీ చేయ‌మ‌ని చెప్ప‌లేమ‌ని వెల్ల‌డించింది. క‌రోనా మ‌హ్మ‌మారిని దృష్టిలో పెట్టుకుని మార‌టోరియం కాలంలో వ‌డ్డీపై మాఫీ చేయాల‌ని, మార‌టోరియంను పొడిగించాల‌ని దాఖ‌లైన పిటిష‌న్ల‌పై విచార‌ణ జ‌రిపిన అనంత‌రం సుప్రీం ఈ తీర్పు వెలువ‌రించింది. మారటోరియం కాలాన్ని పొడిగించ‌మ‌ని చెప్ప‌లేమ‌ని పేర్కొన్న కోర్టు… ఆర్థిక విధానాల్లో న్యాయ‌ప‌ర‌మైన స‌మీక్ష‌… చేప‌ట్ట‌లేమ‌ని స్ప‌ష్టం చేసింది. ఆర్థిక విధాన‌ల్లో న్యాయ‌ప‌ర‌మైన స‌మీక్ష‌.. చేప‌ట్ట‌లేమ‌ని కోర్టు వెల్ల‌డించింది. అలాగే ఇప్ప‌టికే రూ.2 కోట్ల‌వ‌ర‌కు ఉన్న రుణాల‌పై చ‌క్ర‌వ‌డ్డీని కేంద్రం మాఫీ చేసిందని కోర్టు ఈ నేప‌థ్యంలో వెల్ల‌డించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *