శ్రీ‌కృష్ణ రాయ‌బారం…

మ‌హాభార‌త క‌ర్త వ్యాసుడు,వ్యాసుడు స‌త్య‌వ‌తి-ప‌రాశ‌రుల పుత్రుడు. వారికి వ్యాసుడు ఒక ద్వీపంలో జ‌న్మించ‌డంవ‌ల్ల ఆయ‌న‌కు ద్వైపాయ‌నుడుఅనేపేరు క‌లిగింది. ఆయ‌న అస‌లు పేరు కృష్ణ అందుకే ఆచ‌ప కృష్ణ‌ద్వైపాయ‌నుడు.వేదాల‌ను విభ‌జించి వేద‌వ్యాసుడైనాడు. స‌ద్యోగ‌ర్భంలో జ‌న్మించిన వ్యాసుడు జ‌న్మ‌తః పండితుడైనాడు.మ‌హాభార‌తంలో ఎన్నో సంద‌ర్భంలోప్ర‌త్య‌క్షంగా క‌నిపిస్తాడు. పాండ‌వుల అర‌ణ్య‌వాసం నేప‌థ్యంలో అర్జునుని పాశుప‌తాస్త్రం కొర‌కు ప్ర‌య‌త్నించ‌మ‌ని కురుపాండ‌వ జ‌న‌నానికి .మూల‌పురుషుడై, వంశాన్ని ర‌క్షించ‌వ‌ల‌సిన అలాంటి సంద‌ర్భంలో వ్యాసుడు స‌త్య‌వ‌తి ఆజ్ఞ మేర‌కు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాడు. మ‌హాభాత‌రంలో కురు, పాండ‌వ చ‌రిత్ర‌లోపాటు రాజ‌నీతి, అర్థ‌శాస్త్రం,ధ‌ర్మ‌శాస్త్ర‌, సంబంధ సంగ‌తాలు కూర్చ‌బ‌డ్డాయి. అందుకే మ‌హాభార‌తాన్ని స‌క‌ల శాస్త్ర సంగ్ర‌హంగా పేర్కొన్నారు. ఎన్నో మంచిమాట‌లు, నీతులు, ధ‌ర్మాలు బోధించ‌డంవ‌ల‌న సుభాషిత భండాగార‌మ‌ని, నీతుల‌ను నియ‌మ‌ని భార‌తాన్ని కొనియాడుతున్నారు.వ్య‌క్తి స‌చ్చ‌రిత్ర క‌లిగి ఉండాల‌ని, వ్య‌క్తిత్వం కోల్పోయిన‌వాడు స‌మాజంలో గౌర‌వంగా జీవితాన్ని కొన‌సాగించ‌లేడ‌ని చెప్తుంది భార‌తం. ఒక్కోనొన రోజు పాండువుల‌లో పెద్ద‌వాడైన ధ‌ర్మ‌రాజు మ‌రియు కౌర‌వులలోని పెద్ద వాడైన దుర్యోధ‌నునితో కలిసి జూదం అడి రాజ్యాన్ని, త‌మ్ముడ్లను, ద్రౌప‌దిదేవి ని వెంట‌నే పెట్టుకొని అర‌ణ్యానికి ప్ర‌యాణం అయ్యాడు.జూదంలో ఓడిపోతే 12 వసంత‌లు అర‌ణ్య‌వాసం, ఒక్క ఏడాది అజ్ఞాత‌వాసం చేయాలి. పాండువులు ఐదుగురు వారితో పాటు ద్రౌప‌ది కూడ వేళ్లింది. అడ‌వుల‌లోని పండ్లు,దుంప‌లు తీని అనేక క‌ష్టాలు ప‌డి 12 ప‌న్నేండేళ్లు వాన‌వాసం చేశారు. ఒక్క వ‌సంతం అజ్ణాత‌వాసం చేయాలి అని,విరాట రాజ్యానికి వెళ్లి ఐదుగురు పాండ‌వులు ,ద్రౌప‌ది మారు పేర్ల‌తో విరాట‌రాజ్యంలో ఒక ఏడు త‌ల‌ద‌చుకున్నారు.పాండ‌వులు 12 వ‌సంతలు అర‌ణ్య‌వాసం, ఒక్క ఏడాది అజ్ఞాత‌వాసం ముగించుకొని ఉప‌ష్లావ్య ప‌ట్ట‌ణంలో నివాసం ఏర్ప‌ర‌చుకున్నారు.రాజ్య‌భాగం గురించి కౌర‌వ పాండువుల మ‌ధ్య ఒక‌వైపు యుధ్ద సూచ‌న‌లు, మ‌రొక‌వైపు సంధి రాయ‌బారాలు కొన‌సాగుతున్నాయి. అలాంటి త‌రుణంలో ధృత‌రాష్ట్రుడు పాండువుల వ‌ద్ద‌కు దూత‌గా సంజ‌యుని పంపించారు. సంజ‌యుడు తిరిగి వెళ్లిన త‌రువాత పాండువులు శ్రీ‌కృష్ణుని త‌మ రాయ‌బారిగా పంపాల‌ని ఆలోచిస్తున్నారు ఇలాంటి నేప‌థ్యంలో సంజ‌యుడు ఉప‌ప్లావ్య న‌గ‌రం నుండి వెళ్ళి పోయిన మ‌రునాడు ధ‌ర్మ‌రాజు త‌న సోద‌రుల‌ను, కుమారుల‌ను, ఆత్మీయుల‌ను, సేవ‌కుల‌ను స‌భ‌కు పిలిపించాడు. మ‌న‌మంతా శ్రీ‌కృష్ణుని వ‌ద్ద‌కు వెళ్లి అత‌డిని కౌర‌వ స‌భ‌కు రాయ‌బారిగా వెళ్ల‌మ‌ని కోర‌దాం. దానివ‌ల్ల బంధుమిత్ర గురువుల‌తో యుద్ధం త‌ప్పి పోయి మ‌న‌కు మేలు,సంతోషం చేకూరుతాయి. అన్నాడు. వారంతా త‌న‌వెంట‌రాగా శ్రీ‌కృష్ణుని మందిరానికి వెళ్లి అత‌ని ఆద‌ర స‌త్కరాలు పొందాడు. ఒక ప్ర‌క్క ద్రౌప‌ది త‌న ప‌రిజ‌నంతో కూర్చొని ఉండ‌గా త‌న ప‌రివారంతో ప‌రివేష్టితుడై శ్రీ‌కృష్ణునితోపాటు సుఖాసీనుడై అత‌నితో ఇలా అంటున్నాడు. మాక‌ష్టాలు పోగొట్టి, శుభాలు చేకూర్చ‌టానికి స‌మర్థుడ‌వైన నిన్ను మా జ‌న్మ‌కు దిక్కుగా జూపి మా తండ్రియైన‌చ పాండురాజు వెళ్లిపోయాడు. మిత్ర‌కార్యం చ‌క్క‌పెట్ట‌టానికిఇది త‌గిన స‌మ‌యం, నీవుదూత‌గా వెళ్ల‌టం వ‌ల్ల‌) అవినీతి ప‌రుడైన దుర్యోధ‌నునితో యుద్ధం చేసే అవ‌స‌రం లేకుండా మా రాజ్యభాగాన్ని మేము అనుభ‌విస్తాము. కృష్ణా! నీకు మేము నీ కుమారులైన ప్ర‌ద్యుమ్నుని వంటివారం. మాకు యుద్ధం చేసే పాపం అంట‌కుండా ఆలోచించి మ‌మ్మ‌ల్ని కాపాడు. ధ‌ర్మ‌రాజు మాట‌లు విని నీవు చెప్పిన‌ట్లుగా చేస్తాను. నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అని శ్రీ‌కృష్ణుడు అడిగాడు. దానికి నీవు హ‌స్తినాపురానికి వెళ్లి కౌర‌వుల‌తో త‌గుమ‌విధంగా మాట్లాడి మాకు ఒక దారి చూపించు అంటూ అత‌డిని ఒప్పించి ధ‌ర్మ‌రాజు మ‌ళ్లీ ఇలా అంటున్నాడు. సంజ‌యుడి మాట‌ల ద్వారా, మాతండ్రి అయిన ధృత‌రాష్ట్రుని ఉద్దేశం, దుర్యోధ‌నుని తీరు తెలిసింది. మా రాజ్య‌భాగం మాకు ఇవ్వ‌కుండా తీయ‌ని మాట‌ల‌తో బుజ్జ‌గిస్తున్నారు. ఆడిన మాట ప్ర‌కారం మేము అర‌ణ్య అజ్ఞాత వాసాలు పూర్తి చేసి వచ్చినా ధృత‌రాష్ట్రుడు వంశ‌ధ‌ర్మాన్ని పాటించ‌టం లేదు. కొడుకు మీద ప్రేమ‌తో అత‌ని కుటిల‌త్వాన్ని కాద‌న‌లేక‌పోతున్నాడు. ఇంత‌కంటే మాకు ఆప‌ద ఏముంటుంది? మ‌ఆ త‌ల్లీ బంధుజ‌నులూ ఆనందించిన‌ట్లుగా యుద్ధం లేకుండా మేము క‌లిసిమెలిసి ఉండేట‌ట్లుగా ఏమార్గ‌మూ తోచ‌క ఇట్లా ప‌డి ఉండటం మాకు పౌరుషం కాదు. ఇక్క‌డి చుట్టాలూ, నీవూ వింటూండ‌గా మాకు ఐదు ఊళ్లు ఇచ్చినా చాలున‌ని సంజ‌యుడితో అన్నాను. ఆ మాట నిజం. ఆ దుర్యోధునుడు దానికైనా ,ఒప్పుకుంటాడో లేదో తెలియ‌దు. కాని క్రూర‌కార్యానికి పూనుకోవ‌టం మాకు గౌర‌ప్ర‌దం కాదు. రాజ్య సంప‌ద నాక‌వ‌స‌రం లేదు.అనుకొన్నా న‌న్ను ఆశ్ర‌యించుకొన్న వారంద‌రూ కూడుగుడ్డ లేని వార‌వుతారు.కాబ‌ట్టి సఖ్య‌తతో మేము రాజ్య‌భాగం పంచుకోవ‌ట‌మే ఉభ‌యుల‌కూ ఆనంద‌క‌ర‌కం. వారు శత్రువులే అయినా చంప‌టం కాక‌వేరే మార్గం లేదా? ఆప‌క్షంలో మాకు చుట్టాలు, మిత్రూలు ఉన్నారు. సంద‌కోసం వారిని వ‌ధించి నిందల‌‌పాలై పాపం మూట‌గ‌ట్టుకోవ‌టం నేను భ‌రించ‌లేను.

తరువాయి భాగం రేపు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *