ఒంటిమిట్ట శ్రీ‌కోదండ‌రామ‌స్వామి బ‌హ్మోత్స‌వాలు- సీఎం దపంతులు

అమ‌రావ‌తి:ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఒంటిమిట్ట శ్రీ‌కోదండ‌రామ‌స్వామి క‌ళ్యాణాన్ని ఈసారి పూర్తిగా క‌రోనా నిబంధ‌న‌ల‌తో నిర్వ‌హిస్తామ‌ని టీటీడి ఈవో జ‌వ‌హార్ రెడ్డి తెలిపారు. రాముల వారి క‌ళ్యాణానికి కేవ‌లం5వేల మంది భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి క‌ల్పిస్తామ‌న్నారు.కాగా, స్వామివారి క‌ళ్యాణానికి ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌దంప‌తులు హాజ‌ర‌వుతార‌ని ఆయ‌న తెలిపారు. స్వామివారికి సీఎం జ‌గ‌న్ దంప‌తులు ప‌ట్టువ‌స్త్రాలు ,ముత్యాల‌త‌లంబ్రాలు స‌మ‌ర్పిస్తార‌ని టీటీడీ ఈవో జ‌వ‌హ‌ర్ రెడ్డి తెలిపారు.ఒంటిమిట్ట కోదండ‌రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు ఏప్రిల్ 21 నుండి 29 వ‌రకు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి. ఇందులో దేవాదాయ‌శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఈనెల 26న కోదండ రాముడి క‌ళ్యాణం నిర్వ‌హించ‌నున్న‌ట్లు జ‌వ‌హ‌ర్‌రెడ్డి వెల్ల‌డించారు. శుక్ర‌వారం ఒంటిమిట్ట‌లో బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. క‌రోనా నిబంధ‌న‌లు మేర‌కు క‌ళ్యాణ వేదిక ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు. 5వేల‌మందికి క‌ళ్యాణోత్స‌వ పాసులు జారీ చేస్తామ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *