మాల దాస‌రి క‌థ ముగింపు…

నీవు క్రొవ్వుగ‌లిగి బ‌లిసినావు. నాక‌త్తి దెబ్బ‌తో నీ బోడి త‌ల‌ను ఖండించి ర‌క్త‌ధార‌ల‌ను పాన‌ము చేసెద‌ను. నీ మాంస ఖండముల‌ను ఆడుద‌య్యాయి. క‌డ్డికి గ్రుచ్చి కాల్చి తినెద‌రు. తాటితోపుల‌న‌డును, చండాల జ‌న్మ‌ము పోవుట‌కు, ఎవ్వ‌డైన ఒక‌పుణ్య పురుషుడు రాడా! వ‌చ్చి మోక్ష‌మును కల్పించ‌డా! శాశ్వ‌త‌ముగా నా శ‌రీర‌మున‌కు ముక్తి క‌ల్పించ‌డా శిభిచ‌క్ర‌వ‌ర్తి మొద‌ల‌గు వారు నాకు మార్గ‌ద‌ర్శ‌క‌లుకారా! వ్యాధిచేత‌, పిశాచ‌ము చేత‌, వృశ్చిక‌ముల‌చేత‌, విష‌ముచేత‌, పెద్ద‌మ‌నోవ్యాధి చేత‌, ఉద‌క‌ము చేత‌, చోరుల‌వ‌ల‌న‌, మృగ‌ము, అగ్నివ‌ల‌న‌, స్త్రీధ‌న వ్యాసంగ‌ముల చేత‌, పుండుచేత‌, స‌ర్ప‌ము వ‌ల‌న‌, పిడుగుల‌వ‌ల‌న ప్రాణ‌ము వ్య‌ర్థ‌ముగా పోవుట‌కంటే నిన్ను పోషించుట‌లో నాకు తృప్తి క‌ల్గును. మాల‌దాస‌రి త‌ప్ప‌నివాడ‌యి ర‌క్క‌సురి చేరి ఇట్లు ప‌ల్కు చున్నాడు. నీచెర వ‌ద‌లిపోయి స్వామి సేచేసియెల్ల‌బంధ‌ములు వ‌దలివ‌చ్చినాడ‌ను. నీవు న‌న్ను బంధ‌విముక్తుని చేసి పంపిన‌పుడు ఏకాళ్లు, క‌డుపు, చేతులు ఉన్న‌వో, అనియే అట్లాగే ఉన్న‌వి చూచుకొమ్మ‌ని చెప్పెను. ఆ దాస‌రి స‌త్య‌పు మాట‌ల‌కు రాక్ష‌సుడు ఆనంద‌బాష్ప‌ములు రాల్చెను. ఆనందముతో చేవుల‌క‌తుడై ఎండ‌లో సురియాళుని ద‌గ్గ‌ర‌కు వ‌చ్చెను. ప‌ర్వ‌త‌ము వంటి శ‌రీరం గ‌ల రాక్ష‌సుడు హ‌రిదాసుని చుట్టు ప్ర‌ద‌క్షిణ‌ము చేసి పాదాల‌పై బ‌డెను. దాసుడు వానిని లేవ‌నెత్తికౌగిలించు కొన్నాడు. రాక్ష‌సుడు దాసుని పాద‌ము త‌ల‌మీద పెట్టుకున్నాడు. దేవ‌త‌లయందును, రాక్ష‌సుల‌యందును, మునుల‌, రాజుల యందును, యింత‌టి స‌త్య‌ము లేదు. నీ స‌త్య‌మే సిద్ధాంత‌ము. నేను పెద్ద‌వాడ‌ను కావున నీతో స‌మాన‌మ‌గు స‌త్య‌వంతులు లేర‌ని ప్ర‌మాణ‌ము చేసెను. గాన‌ర‌స ప్రవాహ‌మునందుమునుగ కుండ నీవీణ‌కాయ‌ము దెల్చును. కావున త‌న‌ను త‌రింప జేయుమ‌ని కోరున్నాడు. ఆ ప‌ర‌మ భాగ‌వ‌తుడ‌గు దాస‌రి త‌న గానవ్ర‌త‌మును ఒన‌రించితిన‌ని ర‌క్క‌సుని కౌగిలించుకుని ఓరాక్ష‌స్తా! నీ ద‌య‌చేత ధ‌న్య‌డ‌నైతిన‌ని చెప్పెను. నీవింత పుణ్యాత్ముడ‌వు కావున పుణ్య‌జ‌నుడ‌ను బిరుదు నీకే చెల్లిన‌ది. నీకుల‌ము వారంద‌రికి నీకు వ‌చ్చిన పుణ్య‌మే భూషించును. ఇక అధిక‌ప్ర‌సంగ‌ము లెందుకు? ఆక‌లి గొన్న‌వాడ‌వు. నీక‌డుపున‌క‌న‌లాడుచుండును. నీకు మేము బ్ర‌హ్మ‌విధించిన కూడుగా క‌ల‌వార‌ము. దోష‌ములేదు నా దేహ‌మును తినుమ‌నెను. అంత‌టి రాక్ష‌సుడు ఇంత‌కాలం మ‌నుష్య మాంసాహార‌మే తింటిని. మ‌హాపాప‌ము చేసి ఇట్ల‌యితిని శ‌రీరము పెంచుకొని.ఎవ‌రో ఒక త‌ప‌సి రాక‌పోవునా? అని వీక్షించితిని, నీవు వ‌చ్చి పుణ్య‌ము క‌ట్టు కొంటివి. కావున మీవంటి
భాగ‌వ‌తులు మావంటి వారిని ర‌క్షించితిరి. ఇక వ‌రుస‌వేదియినుమును బంగార‌ము జేసిన‌ట్లు మీరు మ‌మ్ముల‌ను ప‌విత్రుల‌ను చేయ‌వ‌ల‌నానికోరిన్నాడు.శరీరము నొల్ల‌క జాలిప‌డి ర‌క్క‌సుడు దాసుని వేడుకొన్నాడు. ఉప‌కార‌ము చేసి ముక్తి క‌ల్పింప చేయుమ‌న్నాడు. నీవు నేను అను జ‌న్మలు విష్ణుభ‌క్తి క‌ల‌వారము కావున మ‌ర‌ల మ‌ర‌ల జ‌న్మ‌ములు వ‌చ్చుచుండెను. ఇక విష్ణుభ‌క్తి క‌లిగిన మ‌రు జ‌న్మ‌లేదు. న‌న్ను ద‌రిచేర్చుమ‌న‌గా ఆదాస‌రి త‌న మంగ‌ళ‌కైశికి రాగ‌ము చేత ముక్తి ప్ర‌సాదింప‌చేసెను. రాక్ష‌సుని రూప‌ము మారిపోయెను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *