పాండ‌వుల వంశోద్ధార‌కుడు ప‌రీక్షితుడు…

పాండురాజు త‌న‌యుడు పాండ‌వుల మ‌ధ్య‌ముడు అయిన అర్జునుడి భార్య సుభ‌ద్రాదేవి గ‌ర్భాన జ‌న్మించిన కుమారుడు అభిమ‌న్యుడు.. అత‌ని భార్య ఉత్త‌ర గ‌ర్భాన జ‌న్మించిన కుమారుడు ప‌రీక్షితుడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన త‌రువాత పాండవులు ప‌రీక్షితుడిని ప‌ట్టాబిషిక్తుడ్ని చేసి మ‌హాప్ర‌స్థానానికి వెళ్ళిపోయారు. ప‌రీక్షితుడు మంచి మ‌న‌స్సుతో స‌త్య‌వ్ర‌తం పాటిస్తూ దేశంలోని ప్ర‌జ‌ల‌ను త‌న సొంత బిడ్డ‌ల‌వ‌లె ప‌రిపాలిస్తున్నాడు. అత‌డి పాల‌న‌లో ధ‌ర్మం, నాయ్యం నాలుగు పాదాల న‌డుస్తూ ప్ర‌జ‌లు ఎంతో సుఖ‌శాంతుల‌తో జీవించ‌సాగారు. ఒక రోజు ప‌రీక్షితుడు అరణ్యానికి వేట‌కువెళ్ళాడు.వేట‌లో అల‌సిపోయాడు. దప్పిక వేసింది. ద‌గ్గ‌ర‌లోనే శ‌మీక మ‌హార్షి నివాసం ఉండే ఆశ్ర‌యం క‌నిపించి అక్క‌డ‌కు వెళ్ళాడు. శ‌మీక మ‌హ‌ర్షి మ‌హాత‌ప‌శ్శాలి.. ప‌రీక్షితుడు వ‌చ్చే స‌మ‌యానికి ఆయ‌న ధాన్యంలో ఉన్నాడు. ప‌రీక్షితుడు మ‌హాత్మా.. దాహం వేస్తున్న‌ది నీరు ఇప్పించండి అంటూ అడిగాడు. మ‌న‌సు.. బుద్ధి.. చిత్త‌ము… ధ్యాన‌మునందు లగ్నం చేసి ఉన్న శ‌మీక మ‌హార్షికి ప‌రీక్షితుని రాక‌గానీ.. అత‌డు మంచినీరు అడగ‌టం కాని తెలియ‌లేదు.ఒక్క‌టి.. రెండు మూడు స్లారు మంచినీరు అరిచి అడిగాడు ప‌రీక్షితుడు. మ‌హార్షి బ‌దులివ్వ‌క‌పోయేస‌రికి ప‌రీక్షితుడురాజున‌యిన త‌నని ఆ మ‌హార్షి అవ‌మానించాడ‌ని మండిప‌డి ప్ర‌క్క‌నే క‌న్పించిన చ‌చ్చిన పామును తీసి శ‌మీక ముని మెడ‌లో వేసి వెళ్ళిపోయాడు.
శ‌మీకుని కుమారుడైన శృంగి ఆశ్ర‌మానికి తిరిగి వ‌చ్చాడు. తండ్రి మెడ‌లో వేల్లాడుతున్న పాము మృత‌శ‌రీరం చూడ‌గానే ఆగ్ర‌హం ముంచుకువ‌చ్చేసింది. ఎంతో పుణ్యాత్ముడైన‌టువంటి నా తండ్రిని ఈవిధంగా స‌త్క‌రించిన‌వాడు ఎవ్వ‌డైనా కానీ నేటికి స‌రిగ్గా ఏడ‌వ‌నాడు స‌ర్ప‌రాజైన త‌క్ష‌కుని కాటుకు మ‌ర‌ణించుగాకా.. అంటూ శ‌పించాడు. ఆ త‌రువాత ధ్యాన ముద్ర నుండి బ‌య‌ట‌ప‌డ‌న శ‌మీకుడు జ‌రిగిన‌దితెలుసుకుని ఎంతో విచారించి..నాయ‌నా.. ప‌రీక్షితుడు పాండ‌వ వంశోద్ధార‌కుడు.. వాసుదేవుని అనుగ్ర‌హం వ‌ల్ల మృత్యుంజ‌యుడైన‌వాడు అటువంటి వానిని తొంద‌ర‌ప‌డి శపించావు కదా.. స‌రే జ‌రిగిందో జ‌రిగింది….. నీ శాప‌వృత్తాతం ప‌రీక్షితుడికి తెలియ‌చేయి..మిలిగిప కొద్ది కాలంలో పాప‌ప్ర‌క్షాళ‌న‌న్నా చేసుకుంటాడు.లేదా త‌క్ష‌కుడి నుండి ర‌క్షించుకునే మార్గం చూసు కుంటాడు.. అంటూ శ‌మీక మ‌హాముని త‌న కుమారుడికి చెప్పాడు. శృంగి వెంట‌నే ప‌రీక్ష‌తుడికి త‌న శాప‌వృత్తాంతం తెలియ‌జేస్తాడు. ప‌రీక్షితుడు అది విని అజ్ఞానానికి చింతించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *