ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టుకు మ‌రో షాక్ ..

ఆఫ్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఐపీఎల్2021 టోర్నీ నుండి విరామం తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అశ్విన్ త‌న కుటుంబ స‌భ్యుల్లో కొవిడ్ వైర‌స్ వ్యాప్తి సంద‌ర్భంలో మంగ‌ళ‌వారం నుండి తాను ఐపీఎల్ కు దూరంగా ఉంటాన‌ని తెలిపాడు. ఈ మేర‌కు అశ్విన్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ సంగ‌తీన్ని ప్ర‌క‌టించాడు. నా కుటుంబ స‌భ్యులు కోవిడ్తో పోరాడుతున్నారు. ఇలాంటి క‌ష్ట‌కాలంలో నేను కుటుంబానికి అండ‌గా ఉండాల‌ని అనుకుంటున్నాను. ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టుకు మ‌రో షాక్ త‌లిగింది. ఆ జ‌ట్టు త‌ర‌పున ఆడుతున్న ఆఫ్ స్పిన్న‌ర్ అశ్విన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు.అందుకే ఈ సీజ‌న్ మంగ‌ళ‌వారం నుండి విరామం తీసుకుంటున్నాను. ఒక‌వేళ ప‌రిస్థితులు మెరుగుఅవుతే మ‌ళ్ళీ ఆడేందుకు వ‌స్తా. ధ‌న్య‌వాదాలు అంటూ ర‌విచంద్ర‌న్ అశ్విన్ తెలిపాడు. కాగా నిన్న హైద‌రాబాద్,ఢిల్లీ మ‌ధ్య జ‌రిగిన మ్యాచులో…ఢిల్లీ క్యాపిట‌ల్స్ అద్భుత విజ‌యాన్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *