శాటిలైట్‌కు స‌తీష్‌ధావ‌న్ లేదా ఎస్‌డీ శాట్ పేరు పెట్టారు…

హైద‌రాబాద్‌:మార్చి నెల చివ‌ర్లో ఓప్రైవేట్ శాటిలైట్ ప్ర‌ధాని ఫొటోతోపాటు ఓ భ‌గ‌వ‌ద్గీత కాపీని, 25వే మంది పేర్ల‌ను అంత‌రిక్షింలోకి మోసుకుపోనుంది. ఈ శాటిలైట్‌కు స‌తీష్‌ధావ‌న్ లేదా ఎస్‌డీ శాట్ పేరు పెట్టారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్ఎల్‌వీ) ద్వారా ఈశాటిలైట్ను పంపించ‌నున్నారు. ఈశాటిలైట్ను SpaceKidz భార‌తదేశంలో అభివృద్ధి చేసింది. ఇది విద్యార్థుల్లో స్పేస్‌సైన్స్‌ను ప్రోత్స‌హించే సంస్థ‌. ఈ శాటిలైట్ మ‌రో మూడు ఫెలోడ్స్‌ను తీసుకెళ్ల‌నుంది. ఇందులో ఒక ఫేలోడ్‌స్పేస్ రేడియేష‌న్‌ను, ఒక‌టి మాగ్నెటోస్పియ‌ర్‌ను అధ్య‌య‌నం చేయ‌నుండ‌గా మ‌రొక‌టి లోప‌వ‌ర్ వైడ్ ఏరియా క‌మ్యూనికేష‌న్ నెట్‌వ‌ర్క్ కోసం పంపిస్తున్నారు. చాలా ఉత్సాహంగా ఉన్నాం త‌మ శాటిలైట్ నింగిలోకి దూసుకెళ్లే క్ష‌ణం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న‌ట్లు SpaceKidz భార‌త‌దేశంలో సీఈవో డాక్ట‌ర్ శ్రీ‌మతీ కేశ‌న్‌చెప్పారు. స్పేస్‌లోకి వెళ్తున్న మా తొలి శాటిలైట్ ఇది. ఈ మిష‌న్‌ను అనుకున్న‌ప్పుడు పేర్లు పంపించాల్సిందిగా ప్ర‌జ‌ల‌ను కోరాము. వారంలోనే 25 వేల మంది పేర్లు వ‌చ్చాయి. ఈ పేర్ల‌తోపాటు ప్ర‌ధాని మోదీ ఫొటోను, ఓ భ‌గ‌వ‌ద్గీత కాపీని కూడా పంపుతాము అని కేశ‌న్ వెల్ల‌డించారు. ఇప్ప‌టికే పేర్లు పంపిన వారికి బోర్డింగ్ పాస్ ఇచ్చిన‌ట్లు తెలిపారు. ఈ పేర్ల‌లో ఇస్రో చైర్‌ప‌ర్స‌న్ కే.శివ‌న్‌, సైంటిఫిక్ సెక్ర‌ట‌రీ ఉమామ‌హేశ్వ‌ర‌మ్ పేర్లు కూడా ఉన్న‌ట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *