భార‌త్ ఫైన‌ల్ కు క్వాలిఫై కావాలంటే ఇంగ్లండ్‌పై క‌నీసం 2 మ్యాచ్‌లు

హైద‌రాబాద‌: ప‌్ర‌స్తుతం మ‌రోబెర్త్ కోసం భార‌త్‌, ఇంగ్లండ్ ఫైట్ చేయ‌నున్నాయి. శుక్ర‌వారం నుంచి ప్రారంభం కాబోయే నాలుగు టెస్టుల సిరీస్ ఈరెండు టీమ్స్‌కూ కీలకం కానుంది.వ‌ర్డ‌ల్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌లో ఇప్ప‌టికే ఒక బెర్త్ ఖ‌రారైంది. సౌతాఫ్రికాలో ఆస్ట్రేలియా త‌న టూర్‌ను ర‌ద్దు చేసుకోవ‌డంతో న్యూజిలాండ్ నేరుగా ఫైన‌ల్ చేరింది. ఇప్పుడు టేబుల్లో 71.7 శాతం పాయిట్ల‌తో భార‌త్ జ‌ట్టు టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ త‌రువాత 70శాతం పాయింట్ల‌తో న్యూజిలాండ్ రెండో స్థానంలో,69.2 శాతం పాయింట్ల‌తో ఆస్ట్రేలియా మూడో స్థానంలో, 68.7శాతం పాయింట్ల‌తో ఇంగ్లండ్ నాలుగుస్థానంలో ఉన్నాయి. భార‌త్ ఫైన‌ల్ కు క్వాలిఫై కావాలంటే ఇంగ్లండ్‌పై క‌నీసం 2 మ్యాచుల్లో విజ‌యం సాధించాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ మాత్రం నాలుగు టెస్టుల్లో క‌నీసం మూడు గెలిస్తేనే ఫైన‌ల్లో క్వాలిపై అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *