కోవిడ్ ఉద్య‌మంలో కేంద్రంతో క‌లిసి ప‌నిచేసేందుకు పార్టీ సిద్ధం- సోనియా

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కొవిడ్ మ‌హ‌మ్మారి ఉద్య‌మంలో భాగంగా కేంద్రంతో క‌లిసి ప‌ని చేసేందుకు త‌మ పార్టీ సిద్ధంగా ఉంద‌న్నారు.సోమ‌వారం వీడియో కాన్ప‌రెన్స్ ద్వారా జ‌రిగిన సీడ‌బ్ల్యూసీ స‌మావేశంలో మాట్లాడిన ఆమె… అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని ఏర్పాటు చేయాల‌ని కేంద్రాన్ని కోరిన‌ట్టు తెలిపారు. భార‌త‌దేశంలో ఆరోగ్య వ్య‌వ‌స్థ కుప్ప‌కూలింద‌న్నారు. క‌రోనా నివార‌ణ‌కు ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రి, శాస్త్ర‌వేత్త‌ల సూచ‌న‌ల‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగా నిర్ల‌క్ష్యం చేయ‌డం వ‌ల్ల దేశం భారీ మూల్యం చెల్లించుకుంటోంద‌న్నారు. 18-45 సంవ‌త్స‌రాల వారికి వ్యాక్సిన్ కోసం అయ్యే వంద‌ల మిలియ‌న్ల మొత్తాన్ని రాష్ట్రాలు భ‌రించాలంటూ మోదీ ప్ర‌భుత్వం తెగేసి చెబుతుండ‌టాన్ని ఆమె త‌ప్పుప‌ట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *