మ‌రింత బ‌లంగా తిరిగి వ‌స్తాను…

పుణె:భార‌త్ బ్యాట్స్‌మ‌న్ శ్రేయ‌స్ అయ్య‌ర్ మ‌రింత బ‌లంగా తిరిగి వ‌స్తాన‌ని అన్నాడు. భుజం గాయం కార‌ణంగా ఇంగ్లాండ్‌తో వ‌న్డే సిరీస్ పాటు ఐపీఎల్ మొత్తానికి దూర‌మైన అత‌డు గురువారం బయోబ‌బుల్ను వీడి ఇంటికి వెళ్లిపోయాడు. ఎంత పెద్ద ఎదురుదెబ్బ త‌గిలితే అంత బ‌లంగా పున‌రాగ‌మ‌నం ఉంటుంది. నేను త్వ‌ర‌లోనే తిరిగొస్తా.. అని శ్రేయ‌స్ ట్వీట్ చేశాడు. నేను మీ సందేశాలు చ‌దువుతునే ఉన్నా మీ ప్రేమ‌, మ‌ద్ధ‌తు నాకెంతో ఆనందాన్నిచ్చాయి. అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు అని చెప్పాడు. ఐపీఎల్ అనంత‌రం ఇంగ్లీస్ కౌంటీ జ‌ట్టు లాంక్‌షైర్ త‌ర‌పున శ్రేయ‌స్ వ‌న్డే టోర్న‌మెంట్ ఆడాల్సివుంది. గాయం వ‌ల్ల అత‌డు ఆ టోర్నీకి కూడా దూర‌మైన‌ట్లే. శ్రేయ‌స్ గైర్హాజ‌రీలో స్టీవ్ స్మిత్ లేదా అశ్విన్ లేదా పంత్ దిల్లీ క్యాపిట‌ల్స్ కు నాయ‌క‌త్వం వ‌హించే అవ‌కాశ‌ముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *