బౌలింగ్‌లోనే ఓ అరుదైన ఘ‌న‌త‌….

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా ప్ర‌ధాన బ్యాట్స్‌మెన్ అంతా ఒక‌రి వెనుక ఒక‌రు పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. ఇప్పుడు ప్ర‌పంచంలోని బెస్ట్ పేస్ బౌల‌ర్ల‌లో ఒక‌డిగా ఉన్న ప్యాట్ క‌మిన్స్ బౌలింగ్‌లో ఆడ‌టానికి ఈ సిరీస్ మొద‌టి నుంచీ మ‌న బ్యాట్స్‌మెన్ త‌డ‌బడుతున్నారు. అలాంటిది టీమిండియా పేస్ బౌల‌ర్ శార్దూల్ ఠాకూర్ మాత్రం అత‌ని బౌలింగ్‌లోనే ఓ అరుదైన ఘ‌న‌త సాధించాడు. అత‌డు క్రీజులోకి వ‌చ్చి రాగానే క‌మిన్స్ వేసిన మూడో బంతినే సిక్స్ కొట్టాడు. టెస్ట్ క్రికెట్లో అత‌ను సాధించిన తొలిప‌రుగులు ఇవే. ఇలా సిక్స్‌తో టెస్ట్ క్రికెట్‌లో ఖాతా తెరిచిన రెండో ఇండియ‌న్ బ్యాట్స్‌మెన్ శార్దూల్ ఠాకూర్‌. గ‌తంలో రిష‌బ్‌పంత్ కూడా ఇలాగే సిక్స్‌తోనే త‌న ప‌రుగుల ఖాతా తెరిచాడు. ఒక్క షాటే కాదు… త‌రువాత కూడా ఆసీస్ బౌల‌ర్ల స‌మ‌ర్థంగా ఎదుర్కొంటూ అద్బుత‌మైన షాట్ల‌తో టీమిండియాను గ‌ట్టేక్కించే ప‌నిలో ఉన్నాడు. శార్దూల్. తొలి టెస్ట్ ఆడుతున్న వాషింగ్జ‌న్ సుంద‌ర్‌తో క‌లిసి కీల‌క‌మైన భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పుతున్నాడు. శార్దూల్ కొట్టిన ఈ సిక్స్ నెటిజ‌న్ల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ర‌క‌ర‌కాల మేమ్స్‌తో శార్దూర్ సిక్స్‌లో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *