మూడు రోజులు పోలీసు క‌స్ట‌డీ లో భూమా అఖిల ప్రియ‌ …

హైద‌రాబాద్‌: బోయిన్‌ప‌ల్లి కిడ్నాప్ కేసులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ మంత్రి భూమి అఖిల ప్రియ‌కు సికింద్రాబాద్ కోర్టు 3 రోజుల పోలీసు క‌స్ట‌డీకి అనుమ‌తి ఇచ్చింది. బెయిల్ ఇవ్వాల‌న్న అఖిల‌ప్రియ పిటిష‌న్‌ను కోర్టు తిర‌స్క‌రించింది. ఆమెను ఈ కేసులో ఇంకా ద‌ర్యాప్తు చేయాల్సి ఉంద‌ని, త‌న క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని పోలీసులు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌కు కోర్టు అనుమ‌తి ఇచ్చింది. అఖిల‌ప్రియ‌ను బెయిల్ మంజూరు చేస్తే సాక్షుల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు కోర్టుకు తెలిపారు.క‌టిక‌నేని సోద‌రుల కిడ్నాప్ కేసులో ఇప్పుడు అఖిల‌ప్రియ రిమాండ్ ఖైదీగా చంచ‌ల్‌గూడ మ‌హిళా జైళ్లో ఉన్నారు. మూడు రోజుల క‌స్ట‌డీలో భాగంగా కిడ్నాప్ వ్య‌వ‌హారంపై అఖిల‌ప్రియను లోతుగా ప్ర‌శ్నించ‌నున్నారు. పోలీసులు. నేటి నుంచి 13వ‌తేదీ వ‌ర‌కు అఖిల‌ప్రియ పోలీసుల క‌స్ట‌డీలో ఉండ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *