రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెల‌వ‌డ‌మే ల‌క్ష్యం…

హైద‌రాబాద్: హైద‌రాబాద్‌- రంగారెడ్డి-మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ల నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఎస్‌.రామ‌చంద్ర‌రావుల ప‌ద‌వీకాలం మార్చి29తో ముగియ‌నుంది.ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు,నాగార్జున సాగ‌ర్ ఉపఎన్నిక నేప‌థ్యంలో అనుస‌రించాల్సిన వ్యూహంపై రాష్ట్ర బీజేపీ క‌స‌ర‌త్తుచేస్తోంది. ఈమేర‌కు బుధ‌వారం రాష్ట్ర బీజేపీ కార్యాల‌యంలో ప‌దాధికారుల కీల‌క స‌మావేశం ప్రారంభ‌మైంది. ఈ స‌మావేశానికి రాష్ట్ర వ్య‌వహారాల ఇన్‌చార్జి త‌రుణ్‌ఛుగ్ హాజ‌ర‌య్యారు. అలాగే కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కిష‌న్‌రెడ్డి ,రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌, ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌, పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌, అగ్ర‌నాయ‌కులు ముర‌ళీమ‌నోహార్‌జోషి, డీకే అరుణ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున పోటీచేస్తున్న అభ్య‌ర్థుల‌న గెలిపించుకోవ‌డం , నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో అభ్య‌ర్థి ఎంపిక త‌దిత‌ర అంశాల‌పై ఈ స‌మావేశంలో చర్చ జ‌రుగుతోంది. ఛాలో గుప్రోడు తాండా సంద‌ర్భంగా బీజేపీ కార్య‌క‌ర్త‌లు, గిరిజ‌నుల‌పై పెట్టిన కేసుల విష‌యంపై కూడా ఈ స‌మావేశంలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక అడ్వొకేట్ దంపతుల హ‌త్య‌పై భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ కూడా ఈ స‌మావేశంలో కీల‌కంగా చ‌ర్చిస్తున్నారు.రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెల‌వ‌డమే ల‌క్ష్యంగా నేత‌ల‌కు త‌రుణ్‌చుగ్‌, బండి సంజ‌య్ దిశానిర్ధేశం చేయ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *