అర్జున్ టెండూల్క‌ర్ మ‌రోసారి నిరాశే …

ముంబైఃభార‌త్ దిగ్గ‌జ క్రికెట‌ర్ స‌చిన్‌టెండూల్క‌ర్ త‌న‌యుడు అర్జున్ టెండూల్క‌ర్ మ‌రోసారి నిరాశే ఎదురైంది. త్వ‌ర‌లో ఆరంభంకానున్న దేశ‌వాళీ టోర్నీ స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జ‌ట్టులో అర్జున్‌కు చోటు ద‌క్క‌లేదు. టోర్నీ కోసం 20మంది స‌భ్యులు జ‌ట్టును ముంబై ఎంపిక చేసింది. సీనియ‌ర్ జ‌ట్టులో చోటు కోసం అర్జున్ ఈ సారి గ‌ట్టిగానే ప్ర‌య‌త్నించాడు. టీమ్ సెల‌క్ష‌న్‌కు ముందుజ‌రిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో అర్జున్ టీమ్-డీ త‌ర‌పున చెప్పుకోద‌గ్గ‌స్థాయిలో రాణించ‌లేక‌పోయాడు. నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు తీసిన అర్జున్‌… మూడు ఇన్నింగ్స్‌ల్లో కేవ‌లం 7ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. సీనియ‌ర్ క్రికెట్ లెవ‌ల్ లో ఆడాల‌ని ఎదురుచూస్తున్న అర్జున్ జ‌ట్టులో చోటు కోసం మ‌రికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. సూర్య‌కుమార్ యాద‌వ్ ముంబై టీ20 జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *