బుడ‌గ‌లో కొన్ని మ‌ధుర జ్ఞాపకాలూ ఉన్నాయి…

చెన్నై: ముంబ‌యి ఇండియ‌న్స్ క్రికెట్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ కొవిడ్ క‌ష్టాల్లోనూ త‌న కిష్ట‌మైన క్రికెట్ ఆడుతున్న ఆనందంగా ఉంద‌ని అన్నారు. బుడ‌గ‌ల్లో ఉండ‌టం ఇబ్బందే అయినా ఇష్ట‌మైన ప‌నిని సుర‌క్షిత వాతావ‌ర‌ణంలో చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఐపీఎల్‌14వ సీజ‌న్లో ఆరంభ మ్యాచుకు ముందు అత‌డు మాట్లాడాడు. చాలా మంది గ‌డ్డుకాలం వెల్ల‌దీస్తున్నారు. ఎంతో మంది ప‌నులు చేసుకోలేక పోతున్నారు. ఇష్ట‌మైన ప‌నులు వ‌దిలేస్తున్నారు. బుడ‌గ‌ల్లో అయినా క‌నీసం మాకిష్ట‌మైన ప‌ని చేసుకోగ‌లుగుతున్నందుకు ఆనందంగా ఉంది. ప్ర‌తిరోజూ నేనిష్ట‌ప‌డే క్రికెట్ ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది. స‌ర్ధుకుపోవాల్సిన స‌మ‌యంలో స‌ర్దుకుపోవాల్సిందే. బ‌యోబుడ‌గ జీవితంలోనూ అత్యుత్తమంగా ఆడేందుకు ప్ర‌య‌త్నించాలి అని రోహిత్ అన్నాడు. ఇంగ్లాండ్ ,ఆస్ట్రేలియా వంటి క‌ఠిన జ‌ట్ల‌పై భార‌త్‌జ‌ట్టు గెల‌వ‌డం ఐపీఎల్‌కు ముందు ఆత్మ‌విశ్వాసం నింపింద‌ని హిట్ మ్యాన్ అన్నాడు. ఆస్ట్రేలియాలో మేం ఏం చేశామో ప్ర‌పంచ‌మంతా చూసింది. సంతృప్తినిచ్చే ప్ర‌ద‌ర్శ‌న‌లు చేశాం. కుర్రాళ్లు అప్పుడే జ‌ట్టులోకి వ‌చ్చి అద‌ర‌గొట్టారు. భుజాల‌పై బాధ్య‌త‌ల‌ను మోసి నిల‌బ‌డ్డారు. ఆ తరువాత ఇంగ్లాండ్‌ను సొంత‌గ‌డ్డ‌పై అన్ని ఫార్మాట్ల‌లో ఓడించాం గ‌ట్టిపోటీనిచ్చే ఆ టీమ్‌ను ఓడించ‌డం భార‌త్ జ‌ట్టులో ఆత్మ‌విశ్వాసం నింపింది. అని అన్నాడు. యూఏఈలో బయో బుడ‌గ‌లో గ‌డిచిన కాలాన్ని రోహిత్ గుర్తు తెచ్చుకున్నాడు. గ‌త సంవ‌త్స‌రం ఐపీఎల్ బ‌యోబుడ‌గ నాకు కాస్త క‌ఠినంగా అనిపించింది. పిక్క కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో మ‌ళ్లీ విశ్రాంతి తీసుకోవాల్సి వ‌చ్చింది. ఆ గాయం సులువైందేంకాఉ. ఎందుకంటే ఆ త‌రువాతే స‌వాల్ తో నిండిన ఆసీస్ ప‌ర్య‌ట‌న ఉంది. ఆ ప‌ర్య‌ట‌న‌ను నేను కొంత మిస్స‌య్యాను. అయితే బుడ‌గ‌లో కొన్ని మ‌ధుర జ్ఞాపకాలూ ఉన్నాయి. సాధార‌ణంగా గ‌దుల్లోంచి బ‌య‌ట‌కురాని ఆట‌గాళ్ల‌తో బుడ‌గ‌ల వ‌ల్ల ఎక్కువ స‌మ‌యం గ‌డిపాం. అందుకే గ‌త సంవత్స‌రంతో పోలిస్తే నా దృక్ప‌థం చాలా మారింది. మా మ‌ధ్య అనుబంధం పెర‌గ‌డం న‌చ్చింది. అని రోహిత్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *