క్షీర‌సాగ‌ర మ‌థ‌నం…..

హిమాల‌యంలోని కైలాస ప‌ర్వ‌త‌ముపై ప‌రమేశ్వ‌రుడు కొలుపుతీరి ఉన్నారు. అత‌డు స్వ‌చ్ఛ‌మైన ముత్యాల‌తోను, ర‌త్నాల‌తోను పొదుగ‌బ‌డిన బంగారు గుండురాయిపైన‌, పార్వ‌తిదేవి ప్ర‌క్క‌న ఉండ‌గా ఆసీనుడై ఉండెను. శంక‌రుడు అర్థ చంద్రునిత‌ల‌పై ధ‌రించిన‌వాడు. న‌ల్ల‌ని కంఠంక‌ల‌వాడు.అప్పుడు దేవ‌త‌లంద‌రు ఆ కొలువులో నివ‌సించిఉన్నారు. అటువంటి స‌మ‌యంలో పార్వ‌తీదేవి త‌న భ‌ర్త‌తో ఈ విధంగా ప‌లికింది. నాథా మ‌హేశ్వరా ,నీకంఠంలో ప్ర‌త్యక్షంగాను, క‌నిపిస్తున్న ఈ న‌లుపేమిటీ? ఇది అన్నిలోకాల్లోను చూచేవారికి ఆనందంగా అందంగాను క‌నిపిస్తుంది. అందుచేత‌,ఓ మ‌హ‌దేవా, నీకంఠ‌మూల‌ము న‌లువైన కార‌ణ‌మునునామీద ద‌య‌తో తెలియ‌జేయుము అన‌గా ఇది విని ఆ శంక‌రడు చెప్ప‌డం ఆరంభించారు.
శాంభ‌వీ! మ‌హావీరుడు, ప్ర‌కాశించే రాక్ష‌సుడు, జంభాసురుడు ఉండేవాడు, అత‌న్ని ఇంద్రుడు త‌న వ‌జ్రాయుధంతో ఖండించాడు. ఆ సంతోషంతో ఇంద్రుణ్ణి దేవ‌త‌లు సేవిస్తూఉండ‌గా,త‌న తెల్ల‌ని ఏనుగు ఐరావ‌తంమీద కూర్చుని ఆకాశ‌మార్గంగా స్వ‌ర్గ‌లోకానికి వ‌చ్చివాడు. ఆ స‌మ‌యంలో గంధ‌ర్వులు ఇంద్రుని ప్ర‌శంసిస్తూ పాట‌ల‌చేత‌ను ఆట‌ల చేత‌ను స్వాగ‌తం చెప్పేవారు.అక్క‌డ ప‌రిస‌రాల్లో ఉండే పారిజాత‌వృక్షం స్నేహ‌భావంతో అప్పుడే విక‌సించిన పూల‌ను రాల్చింది. మందానికిలో ఉండిన బంగారు తామ‌ర‌ల న‌దిలో త‌రంగాలు సంచ‌ల‌నం చేస్తూ చ‌ల్ల‌ని గాలిని ప్ర‌స‌రింప‌చేసినాయి. ఈ విధంగా దేవ‌త‌ల‌కు రాజైన ఇంద్రుడు అమ‌రావ‌తీన‌గ‌రానికి చేరువ‌గా వ‌చ్చాడు. దేవ‌త‌లు అత‌న్ని సేవిస్తూఉన్నారు. ఏనుగుమీద నుండి అత‌డు క‌ద‌లుచున్న మాణిక్య కుండ‌ల‌ముల‌చే ప్ర‌కాశించినాడు. ఇటువంటి
స‌మ‌యంలో దుర్వాసుడ‌నే మ‌హ‌ర్షి ఇంద్రునికి ఎదురుగా వ‌చ్చినిలిచాడు. అత‌డు అనంత‌మైన కాంతి క‌ల‌వాడు .జ్ఞాన‌వంత‌మైన మాట‌ల నేర్పుగ‌ల‌వాడు.త‌న‌జ్ఞానంతో యోగంలో వైభ‌వం క‌లిగి ఆనందించేవాడు. ఆదుర్వాసుడు త‌న చేతుల్లో పుష్పాల‌తో కూర్చిన‌మాల‌ను ధ‌రించి ఉండేను . ఈ మాల‌ను ప్ర‌మ్లోచ అనే దేవ‌తాస్త్రీ అత‌నికి కానుక‌గా ఇచ్చిన‌ట్టిది.అది పారిజాత పుష్పాల‌మాల ఆ పారిజాత‌పు మాల‌ను దుర్వాసుడు ఆశీఃర్వాద పూర్వ‌కంగా కానుక‌గా ఇంద్రునికి దుర్వ‌స మ‌హార్షి ఆశీర్వాద పూర్వ‌కంగా ఇచ్చిన పారిజాత పుష్పాల‌మాల‌ను ఇంద్రుడు శ్ర‌ద్ద‌లేక‌, విజ‌య‌గ‌ర్వంతో ,తాను అధిరోహించి ఉన్న ఐరావ‌తీ గ‌జంకుంభ‌స్థ‌లంపై నిరాద‌రంగా వేసినాడు. అట్లావేసిన దండ‌ను, మ‌దించి ఉన్న ఆ ఏనుగు త‌న తొండంతో గ్ర‌హించి విసిరివేసింది. దానివ‌ల‌న ఆదండ‌లోని పుప్పొడులు చెల్లా చెదురైన‌వి,దానిలోని దుమ్మెలు లేని ఆకాశంలో తిరిగి ఎర్ర‌నిపుప్పొడి అనే దుమ్మునులేపినాయి. దానిని చూచిన ఏనుగు వినోదించిన‌ది.ఇంద్రుడు అధిరోహించిన ఏనుగువ‌ల‌న ఆ పుష్ప‌మాల ఈ విధంగా అయిన‌ప్పుడు దానిస్థితి దుష్టుడైన విటుని చేతిలో బ‌డిన సుంద‌రీమ‌ణి విధంగా క‌న్పించింది. పెద్ద పులిచేతిలో బ‌డిన జింక‌వ‌లెను, జాగ్ర‌త్త‌, జ్ఞానంలేనివాని చేతిలో బ‌డిన‌రాజ్యం వ‌లెను ఉండెను. ఆమాల‌చింద‌ర‌వంద‌ర‌యైక్షీణ ద‌శ‌లో ఉండ‌గా దుర్వాసుని కంట‌ప‌డింది. అది చూచిన దుర్వాసుని స్వ‌రూప స్వ‌భావాలు దుర్నిరీక్షంగా ఉండెను. అత‌ని క‌నుబొమ‌లు, నుదురు ముడిప‌డి పోయెను,శ‌రీర‌మంతా చెమ‌ట‌తో త‌డిసి పోయేను. చెక్కిళ్లు ఎర్ర‌బారెను.అత‌డ‌ప్పుడు ప్ర‌ళ‌య‌కాలంలోని రుద్రుని త‌ల‌పించుచుండెను .ఇట్లు క్రోధావేశుడైన దుర్వాసుడు గ‌ర్జించి భ‌యంక‌ర‌మై దృష్టితో ఇంద్రున్నిచూచి ఇట్లా అన్నాడు.

రేపు త‌రువాయి భాగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *