రిష‌బ్‌పంత్ ప్లేయ‌ర్ఆఫ్ ద మంత్ అవార్డు..

దుబాయ్‌: భార‌త్ జ‌ట్టు క్రికేట్ ఆట‌గాడు రిష‌బ్‌పంత్ జ‌న‌వ‌రిలో చారిత్ర‌క విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొలి సారి ప్ర‌వేశ‌పెట్ట‌న ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్ అవార్డును జ‌న‌వ‌రి నెల‌కుగాను భార‌త్ వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ ద‌క్కించుకున్నాడు. ఈక్ర‌మంలో అత‌డు ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, ఐర్లండ్ ప్లేయ‌ర్ పాల్ స్టిర్లింగ్‌ల‌ను వెన‌క్కి నెట్టాడు. బ్రిస్బేన్ టెస్ట్‌లో 89 ప‌రుగులు చేసిన పంత్ ..టీమ్‌కు అద్వితీయ‌మైన విజ‌యాన్ని సాధించి పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల సిడ్నీ టెస్ట్‌లోనూ 97 పరుగులు చేసిన పంత్‌… ఆమ్యాచ్ డ్రాగా ముగియ‌డంలో త‌న వంతు పాత్ర పోషించాడు. ఈరెండు టెస్టుల్లోనూ క్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లో పంత్ ఆడిన తీరు అద్భుత‌మ‌ని ఐసీసీ కొనియాడింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *